Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డైరెక్టర్ పేరు లేపేశారు: శ్రీకాంత్ ‘రా..రా’ సినిమా విషయంలో వివాదమేంటి?
హీరో శ్రీకాంత్ , నాజియా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం 'రా రా'. శ్రీమిత్ర చౌదరి సమర్పణలో విజి చెర్రీస్ విజన్స్ నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 23న విడుదలవుతుంది. ఇటీవల విడుదలైన పోస్టర్ల మీద అసలు డైరెక్టర్ పేరే లేదు. మరి ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించారు? అనేది తెలియడం లేదు. ఇదే విషయం శ్రీకాంత్‌ను అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పారు.
సినిమా పోస్టర్ల మీద డైరెక్టర్ పేరు లేదేంటి?
‘రా..రా' సినిమా పోస్టర్ల మీద డైరెక్టర్ పేరు లేదు, మీకు దర్శకుడికి ఏమైనా గొడవలు ఉన్నాయా? అని మీడియా వారు ప్రశ్నించగా..... దర్శకుడితో తనకు ఎలాంటి గొడవలు లేవని, దర్శకుడికి నిర్మాతతో ఉన్నాయని అందుకే పేరు వేయలేదని తెలిపారు.
సినిమాకు ఎవరు దర్శకత్వం వహించారు?
సినిమాకు ఎవరు దర్శకత్వం వహించారు? అనే ప్రశ్నకు శ్రీకాంత్ స్పందిస్తూ..... ‘ఈ సినిమాను యూనిట్ మొత్తం డైరెక్ట్ చేసింది. యూనిట్లో ఉన్న ఒక మంచి డైరెక్టర్ చేశాడు. అతడి పేరు రివీల్ చేయొద్దన్నారు. అందుకే చెప్పడం లేదు' అని తెలిపారు.
ఆయన ఒప్పుకుంటే
సినిమా విడుదల తర్వాత ఆయన ఒప్పుకుంటే తప్పకుండా డైరెక్ట్ చేసిన వ్యక్తి పేరు చెబుతాం..... అప్పటి వరకు సస్పెన్స్ అంటూ శ్రీకాంత్ మాట దాటవేశారు.
సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చింది
ఈ సినిమా విషయంలో నేనెక్కడా డిస్ట్రబ్ అవ్వలేదు. నిర్మాతకు, దర్శకుడికి చిన్న చిన్న గొడవలు వచ్చాయి. ఆయనకు హెల్త్ బాగోలేక ఇంకా చిన్ని చిన్న ఇష్యూలతో సినిమా ఆగిపోయే పరిస్థితి వచ్చింది. సినిమా ఆగిపోకూడదు, నిర్మాత నష్టపోకూడదు అని చేశాం.... అని శ్రీకాంత్ తెలిపారు.
నేను నిర్మాతలకే సపోర్టు చేస్తాను
ఆ డైరెక్టర్ ఇపుడు తీయను, సంవత్సరం తర్వాత తీస్తాను...అంటే నిర్మాత ఆపుకుని కూర్చోలేడుకదా. నేను ఎప్పుడూ నిర్మాతలకు సపోర్టు చేస్తాను. ఈ ప్రొడ్యూసర్ అనే కాదు ఏ ప్రొడ్యూసర్ అయినా సరే. ఆయన అంత డబ్బులు ఖర్చు పెట్టి ఏమైనా అయితే నష్టపోవాల్సి వస్తుంది. అందుకే నిర్మాత మాట ప్రకారం చేశాను. అందుకే ఇంకో మంచి డైరెక్టర్ పెట్టి చేశాం అని శ్రీకాంత్ వెల్లడించారు.
రా..రా సినిమా కాన్సెప్టు ఇదే
హారర్ జోనర్లో నేను చేసిన తొలి సినిమా. హారర్ సినిమాలు చాలానే ఉన్నా ఈ సబ్జెక్ట్ కొత్తగా ఉంటుంది. ఇందులో కొత్త విషయం ఏమిటంటే దెయ్యాలతో సినిమా చేయడం. దెయ్యాలతో సినిమా ఎలా తీస్తారు అనేది చాలా గమ్మత్తుగా ఉంటుంది. ‘రా..రా'లో దెయ్యాలతో సినిమా చేసి సక్సెస్ అవుతాం. అటువంటి కాన్సెప్టుతో ఉన్న సినిమా ఇది. రిజల్టును ఆడియన్స్ డిసైడ్ చేస్తారు. మేము మాత్రం చాలా హోప్స్ తో ఉన్నాం అన్నారు.
జనసేన పార్టీలోకి నన్ను లాగొద్దు
పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో చేరుతారా? అనే ప్రశ్నకు శ్రీకాంత్ స్పందిస్తూ... నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు. నాకు వాటి మీద అవగాహనగానీ, ఆసక్తికానీ లేదు. ఒక వేళ వెళితే నేనే ప్రెస్ మీట్ పెట్టి తప్పకుండా చెబుతాను అని శ్రీకాంత్ వెల్లడించారు.