శ్రీకాంత్ లేటెస్ట్ చిత్రం 'సేవకుడు' చిత్రం స్టోరీ లైన్ ఏమిటి?
శ్రీకాంత్, చార్మి కాంబినేషన్ లో వి.సముద్ర దర్శకత్వంలో సేవకుడు అనే చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రం కథ గురించి దర్శకుడు వి.సముద్ర మాట్లాడుతూ...నేతలంతా ప్రజాసేవ పేరుతోనే గద్దెనెక్కుతారు. అధికారం చేతిలోకి రాగానే అసలు విషయాన్ని మరిచిపోతారు. సొంత సేవలోనే తరిస్తూ ఐదేళ్ల కాలం వెళ్లదీస్తారు. మన సమాజంలో జరిగే ఇలాంటి నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ..నిజమైన సేవకు అర్థం చెప్పిన ఓ యువకుడి కథే మా చిత్రం అంటున్నారు. అలాగే నిర్మాత ఎమ్.సుధాకర్ మాట్లాడుతూ "వైవిధ్యమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. శ్రీకాంత్ నటన, హావభావాలు మాస్ ప్రేక్షకులను అలరించేలా ఉంటాయి. కథకు తగ్గట్టుగా టైటిల్ కుదిరింది. శ్రీకాంత్ తో మేం చేస్తోన్న మూడో చిత్రమిది. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుతున్నాం. త్వరలోనే టాకీ భాగాన్ని పూర్తి చేస్తామన్నారు. ప్రదీప్ రావత్, ఆహుతిప్రసాద్, బ్రహ్మానందం, అలీ, జయప్రకాష్ రెడ్డి, నాజర్, హేమ తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. సంగీతం: శ్రీకాంత్ దేవా అందిస్తున్నారు. ఇక శ్రీకాంత్, ఛార్మీ కాంబినేషన్ లో ఇంతకుముందు కౌసల్యా సుప్రజా రామా అనే చిత్రం వచ్చింది. ఇక శ్రీకాంత్ గత చిత్రం మహాత్మా లోనూ చార్మి ఓ ఐటం సాంగ్ చేసి అలరించింది. శ్రీకాంత్ ప్రస్తుతం ఈ చిత్రం కాక రంగ ది దొంగ అనే చిత్రం కూడా చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











