Don't Miss!
- Finance IT News: బెంగళూరులో టెక్కీలు సంచలన నిర్ణయం.. అయోమయంలో హౌస్ ఓనర్స్..
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
శ్రీకాంత్ శత్రువు ఆడియో విడుదల
సినిమా గురించి హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ గతంలో వెంకటేష్ గారు నటించిన శత్రువు మూవీ టైటిల్ పెట్టారు. కథకు తగిన విధంగా ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గుణకి సంగీత దర్శకుడిగా మొదటి సినిమా ఇది. మాస్ మెలోడితో పాటు అన్ని రకాల సాంగులను అద్భుతంగా కంపోజ్ చేసారు. మా అందరికీ సినిమా మంచి విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.
దర్శకుడు ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ... సినిమా శ్రీకాంత్ ఇమేజ్ కు తగిన విధంగా ఉంటుంది, ప్రేక్షకులు తప్పకుండా ఈచిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను, నన్నుప్రొత్సహించిన నిర్మాతకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.
రెహమాన్, గిరిబాబు, బ్రహ్మ్రానందం, రఘుబాబు, చైతన్య మంత, వేణుమాధవ్, జాకీ, ప్రభాకర్, దువ్వాసి మోహన్ తదితరులు ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సినిమాటోగ్రఫి: రాహుల్, సంగీతం: గణ, ఎడిటర్: వి.నాగిరెడ్డి, ఆర్ట్: వి.ఎన్.సాయిమణి, సాహిత్యం: చంద్రబోస్, సాహితి, కొరియోగ్రఫి: స్వర్ణ, ప్రొడక్షన్ కంట్రోలర్: వెంకట్ వుయ్యూరు, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: పి.వి.శాస్త్రి, నిర్మాణ నిర్వహణ: గుర్రం శ్రీనివాసరెడ్డి, నిర్మాత: వి.యస్.రామిరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎన్.ఎస్.ఆర్.ప్రసాద్.