twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రీకాంత్ శత్రువు ఆడియో విడుదల

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: శ్రీకాంత్‌-అక్ష జంటగా వి.యస్‌.ఆర్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎన్‌.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌ దర్శకత్వంలో వి.యస్‌.రామిరెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'శత్రువు' ఈచిత్రం ఆడియో విడుదల కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. మంత్రి ఘంటా శ్రీనివాసరావు ఈ చిత్ర ఆడియో సీడీని ఆవిష్కరించి మాజీ మంత్రి మైసూరా రెడ్డికి అందించారు.

    సినిమా గురించి హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ గతంలో వెంకటేష్ గారు నటించిన శత్రువు మూవీ టైటిల్ పెట్టారు. కథకు తగిన విధంగా ఉండటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గుణకి సంగీత దర్శకుడిగా మొదటి సినిమా ఇది. మాస్ మెలోడితో పాటు అన్ని రకాల సాంగులను అద్భుతంగా కంపోజ్ చేసారు. మా అందరికీ సినిమా మంచి విజయాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను అని చెప్పుకొచ్చారు.

    దర్శకుడు ఎన్.ఎస్.ఆర్ ప్రసాద్ మాట్లాడుతూ... సినిమా శ్రీకాంత్ ఇమేజ్ కు తగిన విధంగా ఉంటుంది, ప్రేక్షకులు తప్పకుండా ఈచిత్రాన్ని ఆదరిస్తారని నమ్ముతున్నాను, నన్నుప్రొత్సహించిన నిర్మాతకు కృతజ్ఞతలు అని చెప్పుకొచ్చారు.

    రెహమాన్‌, గిరిబాబు, బ్రహ్మ్రానందం, రఘుబాబు, చైతన్య మంత, వేణుమాధవ్‌, జాకీ, ప్రభాకర్‌, దువ్వాసి మోహన్‌ తదితరులు ముఖ్య తారాగణంగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్‌ చిత్రానికి సినిమాటోగ్రఫి: రాహుల్‌, సంగీతం: గణ, ఎడిటర్‌: వి.నాగిరెడ్డి, ఆర్ట్‌: వి.ఎన్‌.సాయిమణి, సాహిత్యం: చంద్రబోస్‌, సాహితి, కొరియోగ్రఫి: స్వర్ణ, ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: వెంకట్‌ వుయ్యూరు, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: పి.వి.శాస్త్రి, నిర్మాణ నిర్వహణ: గుర్రం శ్రీనివాసరెడ్డి, నిర్మాత: వి.యస్‌.రామిరెడ్డి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: ఎన్‌.ఎస్‌.ఆర్‌.ప్రసాద్‌.

    English summary
    Srikanth and Aksha starrer Shatruvu movie music launched yesterday. NSR Prasad is directing the film and V S Ramireddy is producing the film on VSR Productions.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X