‘దండుపాళ్యం’ దర్శకుడితో శ్రీకాంత్
తెలుగు, కన్నడ భాషలలో రూపొందనున్న ఈచిత్రం జూన్ నెలలో సెట్స్ పైకి వెళ్లనుంది. ఇతర నటీనటులు, సాంకేతికవర్గం వివరాలు త్వరలోనే తెలియపరుస్తామని నిర్మాతలు తెలిపారు. ఈ సినిమా గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ, వైవిధ్యమైన కథాంశంతో రూపొందే ఈ చిత్రం 'దండుపాళ్యం' సినిమాలా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకముందని అన్నారు. చిత్ర కథ, కథనాలు కొత్తదనాన్ని కలిగి ఉంటాయని దర్శకుడు శ్రీనివాసరాజు తెలిపారు. బ్యానర్: 'గోల్డెన్ లయన్ ఫిలిమ్స్, ఇ స్క్వేర్, నిర్మాతలు : సి.ఆర్.మనోహర్, విజయ్, కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: శ్రీనివాసరాజు.
ప్రస్తుతం శ్రీకాంత్ 'షాడో' సినిమాలో సైడ్ హీరోగా చేస్తున్నాడు. ఈచిత్రానికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ మెయిన్ హీరో. 'అనుచరుడు' అనే మరో చిత్రంలో కూడా శ్రీకాంత్ నటిస్తున్నాడు. ఇక ఈ సంవత్సరం విడుదలైన శ్రీకాంత్ సినిమాలు సేవకుడు, శ్రతువు బాక్సాఫీసు వద్ద బోల్తా పడ్డాయి.


Click it and Unblock the Notifications












