Pindam Teaser: గుండెల్లో గుబులు.. భయానికి అడ్డా.. పిండం టీజర్ చూశారా?
పిండం.. ఈ పేరు వినడానికే చాలా కొత్తగా అనిపిస్తోంది. అలాగే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండబోతున్నట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ శ్రీరామ్, ఖుషీ రవి కాంబోలో తాజాగా వస్తున్న చిత్రం పిండం. ఈ సినిమా పేరు ప్రకటించినప్పటి నుంచి ఫుల్ బజ్ క్రియేట్ అయింది. సాయికిరణ్ దైదా దర్శకుడిగా ఈ సినిమాతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సినిమా పేరుకు తగ్గట్లుగానే ఇప్పటి వరకూ చూడని భయంకరమైన చిత్రం అనే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చి అందరిలోనూ ఇంట్రెస్ట్ కల్గజేశారు. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను చిత్ర బృందం ఈరోజు విడదల చేసింది.
టీజర్ చూస్తుంటే సినిమాపై విపరీతమైన అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా టీజర్ లో చూపించిన సీన్లు, నటీనటులు చెప్పే డైలాగులు వింటుంటూనే చెమటలు పట్టేస్తున్నాయి. ముఖ్యంగా ఆత్మల చుట్టూ ఈ సినిమా కథ తిరగబోతుందని అర్థం అవుతుంది. హారర్ థ్రిల్లర్ గా రాబోతున్న ఈ సినిమాను కాలాహి మీడియా బ్యానర్ పై యశ్వంత్ దగ్గుబాటి సినిమాను నిర్మిస్తున్నారు. టీజర్ ప్రారంభంలోనే ఈశ్వరీ రావు, అవసరాల శ్రీనివాస్ ను చూపిస్తారు. ఓ పాడు బడిన ఇంటి దగ్గర వీరిద్దరూ ఉండగా.. ఈశ్వరీరావు ఇదేదో మామూలు కుక్కలాగా లేదు, వేరే జంతువు లాగా ఉందని.. వెంటనే పూడ్చి పెట్టమని చెబుతుంది. లేదంటే ఈ ఊరకే ప్రమాదం అంటూ హెచ్చరిస్తుంది.

ఈశ్వరీ రావు పాత్రను చూస్తుంటే.. ఆమె ఈ సినిమాలో ఆత్మలు, దెయ్యాలను బంధించే శక్తి గల దానిలాగా కనిపిస్తుంది. అలాగే మీ కెరియర్ లో ఏదైనా భయపెట్టే కేసు ఉందా అదేంటీ అని అడగ్గా.. ఆమె ఉందని చెబుతుంది. దాన్ని ఇప్పటికీ మర్చిపోలేనంటూ వివరిస్తుంది. అది ఓ శక్తివంతమైన ఆత్మకథ అంటూ చెప్పగానే.. అసలు కథ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత ఊరి చివరన గల ఓ పాడు బడిన ఇంటిని చూపిస్తారు. అలాగే ఆ ఇంట్లో ఉండే ఓ కుటుంబాన్ని గురించి చెబుతారు. ఓ తల్లి, ఇద్దరు భార్యాభర్తలు, వారికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నట్లు చూపిస్తారు.
వీరి ఇంట్లో జరిగే కొన్ని సంఘటనలను చూసి కుటుంబ సభ్యులు అంతా తీవ్రంగా భయపడిపోతారు. ఒక్కొక్కరికీ కలిగే ఒక్కో అనభవానికి అంతా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఈశ్వరీ రావు వచ్చి ఇంట్లో అనేక శక్తులు ఉన్నాయని చెప్పడం చూస్తుంటే నిజంగా ఒళ్ల గగుర్పొడుస్తుంది. ముఖ్యంగా శ్రీరామ్ చిన్న కూతురుకు దెయ్యం పట్టడం, పడుకొనే ఆమె గట్టిగా వెక్కిలిగా నవ్వడం మనం టీజర్ లో చూడవచ్చు. ఆ తర్వాత శ్రీరామ్ ఏదో తగులబెట్టినట్లు చూపిస్తారు. అంతటితో వారికి ఆత్మ భయం పోయిందని చూస్తుంటే అనిపిస్తోంది.
ఇక చివరలో "కళ్లకు కనిపించే భౌతిక ప్రపంచం చాలా చిన్నది. దాన్ని సరిహద్దులు మనకు అర్థం అవుతాయి. కానీ లోపల ప్రపంచంలో సరిహద్దులు ఉండవు. అది అంత తేలిగ్గా అర్థం కాదంటూ" ఈశ్వరీ రావు వాయిస్ వస్తుండగా.. పాపను ఓ టేబుల్ పైట పడుకోబెట్టి కెమెరాను తిప్పుతూ చూపించారు. అయితే ఈ సినిమాను వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు టీజర్ లో కూడా చెప్పారు. ఇదంతా చూస్తుంటే నిజంగానే చాలా భయంగా ఉంది. మరి సినిమా ఈ రేంజ్ లో భయపెడుతుందో చూడాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











