బాలకృష్ణతో అనగానే చాలామంది నన్ను భయపెట్టారు
బాలకృష్ణతో సినిమా చేస్తున్నాను అనగానే చాలామంది నన్ను ముందు భయపెట్టారు. కానీ, మనకు వినే ఓపిక ఉండాలే గానీ వెనకటి సినిమాల్లో విషయాలు చెబుతారు, పద్యాలు పాడతారు.. అన్నీ చెప్పేస్తారు. వేరే టాపిక్‌లు ఏమీ ఉండవు. సినిమా గురించే అన్నీ ఉంటాయి. ఇంత వరకు నేను ఆయన కోపం మాత్రం చూడలేదు అంటూ చెప్పుకొచ్చారు హీరో శ్రీకాంత్.బాలకృష్ణ హీరోగా చేస్తున్న శ్రీరామరాజ్యం చిత్రంలో శ్రీకాంత్ లక్ష్మణుడుగా చేస్తున్నారు.బాపు దర్సకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతోంది.నయనతార సీతగా చేస్తున్న ఈ చిత్రంలో బాలయ్య శ్రీరాముడుగా కనిపించనున్నారు.ఇక రీసెంట్ గా విడుదలైన శ్రీకాంత్ ధుశ్శాసన చిత్రం డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఈ చిత్రం అనంతరం సేవకుడు,విరోధి చిత్రాలు రెడీ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











