సింహా చిత్రం స్థాయిలో అదరకొట్టాం...శ్రీకాంత్
సింహా స్థాయిలో చక్రి రీరికార్డింగ్ అదరగొట్టాడు. గౌతంరాజు ఎడిటింగ్ ఈ సినిమాకు పెద్ద ప్లస్. విమలా రామన్ చాలా గ్లామర్ గా, కొత్తగా కనిపిస్తుంది అని హీరో శ్రీకాంత్ తన తాజా చిత్రం రంగ ది దొంగ విశేషాలు చెప్పుకొచ్చారు. ఈ చిత్రం నెల(డిసెంబర్) 30న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రం విశేషాలను మీడియాకు తెలియచేసారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ...ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన, మహాత్మ చిత్రాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా పూర్తిస్థాయిలో మాస్‌ని ఆకట్టుకునే చిత్రం రంగ ది దొంగ. ఓ పెద్ద దర్శకుని తరహాలో జీవీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మహాత్మ తర్వాత నిర్మాత మనోహర్ మళ్లీ నాతోనే ఈ సినిమా చేయడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఇక ఈ చిత్రంలో శ్రీకాంత్ ద్విపాత్రాభినయం చేసారు. సుధాకర్ నాయుడు(జీవీ) దర్శకత్వంలో గోల్డెన్ లయన్ ఫిలింస్, గాడ్ ఫాదర్ ఫిలింస్ సంయుక్త నిర్మాణంలో సి.ఆర్.మనోహర్, సుధాకర్ నాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు.


Click it and Unblock the Notifications











