వెబ్ సైట్లలో రాసారు, అవేమీ నిజం కాదు:హీరో శ్రీకాంత్
ఈ సినిమాలో ప్రత్యేకంగా ఓ రాజకీయనాయకుణ్ని, హీరోని విమర్శిస్తున్నామనే వార్తలు వచ్చాయి. అంతే కాకుండా హీరోయిన్ సంజనను నగ్నంగా చూపిస్తున్నామని కొన్ని వెబ్‌సైట్లలో రాశారు. కానీ అవేవీ నిజం కాదు అంటున్నారు శ్రీకాంత్. అలాగే ప్రేక్షకులు ఆదిరిస్తారనే సినిమాలు తీస్తాం.ప్రత్యేకంగా ఎవర్నీ విమర్శించడానికి సినిమాలు తీయను. రాజకీయాల్లో ఉన్న అవినీతిని ఎత్తిచూపే ప్రయత్నమే ఈ చిత్రం అన్నారు.ఆయన తాజా చిత్రం 'దుశ్శాసన'విశేషాలను మీడియాకు తెలియచేస్తూ ఇలా స్పందించారు. అలాగే..ఆ పరేషన్ ధుర్యోధన చిత్రం తరహాలో భిన్నమైన పాత్ర ఇందులో పోషిస్తున్నాను. కామన్ మేన్‌గా నటిస్తున్నాను. సమాజంలోని సమస్యల నేపథ్యంగా సాగే చిత్రమిదన్నారు. ఇక దర్సకుడు పోసాని మాట్లాడుతూ...చేగువేరాకి శ్రీకాంత్ పాత్రకి ఎలాంటి సంబంధం లేదన్నారు.


Click it and Unblock the Notifications











