పవన్ 'కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్' తరహాలోనే శ్రీకాంత్
ఆ మధ్యన పవన్ కళ్యాణ్ కామన్ మ్యాన్ ప్రొటక్షన్ ఫోర్స్ అని ప్రకటించారు.ఆ తర్వాత అదేమైందో తెలియదు కానీ ప్రస్తుతం శ్రీకాంత్ మాత్రం కామన్ మ్యాన్ ని ప్రొటక్షన్ చేయటమే తన తాజా చిత్రం 'దుశ్శాసన'లో కథాంశం అంటున్నాడు.శ్రీకాంత్ మాట్లాడుతూ..సినిమా లో దుశ్శాసనుడు సామాన్య వ్యక్తికి ప్రతినిధి. అతని పేరే కామన్‌మేన్. సమాజంలోని సమస్యలపై సోరాటం చేస్తుంటాడు. ప్రజాప్రతినిధులు జనం యోగ క్షేమాలు మర్చిపోయి ధనార్జనే ధ్యేయంగా బతికేస్తున్నారు. వీళ్లని సరైన దారిలో పెట్టడమే ఇతగాడి ప్రధాన లక్ష్యం.అలాగే 'ఆపరేషన్ దుర్యోధన'కి 'దుశ్శాసన' కొనసాగింపని చాలా మంది అనుకుంటున్నారు. కానీ రెండింటికీ ఎలాంటి సంబంధం ఉండదు. ప్రస్తుత రాజకీయ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తి చూపే చిత్రమిది. అవినీతిపరులు అందలం ఎక్కడానికి ప్రజలు కూడా బాధ్యులే. ప్రజల చేతిలోని బలమైన ఆయుధం ఓటు. దాన్ని సరైన రీతిలో ఉపయోగించకే ఈ సమస్యంతా. ఈ వాస్తవాన్ని చెప్పే కథ ఇది అన్నారు. పోసాని కృష్ణ మురళి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం రేపు(శుక్రవారం)విడుదల అవుతోంది. పోసాని కృష్ణమురళి. శ్రీకాంత్, సంజన జంటగా లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మురళీకృష్ణ నిర్మించిన 'దుశ్శాసన' చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు. ఈ నెల 27న ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.


Click it and Unblock the Notifications