శ్రీకాంత్, తరుణ్ కాంబినేషన్ చిత్రం మొదలైంది

By Srikanya

శ్రీకాంత్, తరుణ్ కాంబినేషన్‌లో ప్రహర్ష ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ప్రవీణ్ బాల నిర్మిస్తోన్న 'అనుచరుడు' చిత్రం షూటింగ్ బుధవారం ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా జాస్మిన్ నాయికగా, అశోక్ అల్లే దర్శకునిగా పరిచయం అవుతున్నారు. హీరోలు, హీరోయిన్‌పై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి రాష్ట్ర సమాచార, సినిమాటోగ్రఫీ మంత్రి డి.కె. అరుణ క్లాప్‌నివ్వగా, సీనియర్ నిర్మాత కె.వి.వి.సత్యనారాయణ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.

దర్శకుడు బోయపాటి శ్రీను గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ "ఇది మంచికథతో తయారవుతోన్న చిత్రం. దర్శకుడు, నిర్మాత స్క్రిప్టు మీద బాగా వర్క్ చేశారు. తరుణ్‌తో కలిసి తొలిసారి నటిస్తుండటం సంతోషంగా ఉంది" అన్నారు. తరుణ్ మాట్లాడుతూ "శ్రీకాంత్ నాకు మంచి మిత్రుడు. ఇద్దరం మంచి పాత్రల్లో కలిసి నటిస్తున్నాం.

సినిమాలో ఎన్నో ఆసక్తికరమైన మలుపులు, సన్నివేశాలున్నాయి. చక్రి సంగీతం ఓ ఆకర్షణ" అని చెప్పారు. నిర్మాత ప్రవీణ్ బాల మాట్లాడుతూ "దర్శకుడు చెప్పిన కథలోని కొత్తదనం నచ్చి ఈ సినిమా నిర్మిస్తున్నా. తరుణ్‌కి ఓ కొత్త ఇమేజ్ తీసుకొచ్చే యాక్షన్ అంశాలు ఇందులో ఉన్నాయి. మార్చి వరకు జరిపే షూటింగ్‌తో సినిమా పూర్తవుతుంది. వేసవిలో చిత్రాన్ని విడుదల చేస్తాం" అన్నారు. ఇది మంచి యాక్షన్ ఎంటర్‌టైనర్ అనీ, ఇందులో చక్కని ప్రేమకథ కూడా ఉందనీ దర్శకుడు అశోక్ తెలిపారు.

మాటల రచయిత శ్రీనాథ్ మాట్లాడుతూ "అనుచరుడు అనే పదానికి అర్థం చెప్పే సినిమా ఇది. అనుచరుడికి విశ్వసనీయత ఎంత ముఖ్యమో, నాయకుడికి కూడా అనుచరుడి పట్ల బాధ్యత అంతే అవసరం అని చెప్పే కథ" అన్నారు. పోసాని కృష్ణమురళి, శివారెడ్డి, అజీజ్‌ఖాన్, దిల్ రమేశ్, హబీబ్ బాయ్, అనిల్, సత్తెన్న, జగన్, అర్చన, సందీప్తి, సదా తారాగణమైన ఈ చిత్రానికి సంగీతం: చక్రి, సినిమాటోగ్రఫీ: భూపతి, కూర్పు: గౌతంరాజు, కళ: సత్యనారాయణ, ఫైట్స్: రవివర్మ, సమర్పణ: కె. సాగర్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: అశోక్ అల్లే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X