నాగార్జున, వెంకటేష్ లతో కలిసి శ్రీకాంత్
శ్రీకాంత్ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ లో బిజి అవుతున్నట్లు కనపడుతోంది. తాజాగా ఆయన వెంకటేష్, మెహర్ రమేష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న చిత్రంలో ఓ పాత్రకు గానూ ఎంపిక అయ్యాడు. అలాగే నాగార్జున,రాఘవేంద్రరావు కాంబినేషన్ లో రూపొందే షిర్డీ సాయి చిత్రంలోనూ సినిమాలో వచ్చే రాజు పాత్రకు ఎంపిక అయ్యాడు. వెంకటేష్ తో చెయ్యబోయే సినిమా పిబ్రవరి నుంచి ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత నాగార్జునతో చేయబోయే చిత్రం ప్రారంభమవుతుంది. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ తన స్నేహితుడు జెడి చక్రవర్తితో ఓ చిత్రం కమిటయ్యాడు.'ఆల్ ది బెస్ట్'టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రం రీసెంట్ గా హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ చిత్రం వివరాల్లోకి వస్తే. .శ్రీకాంత్, జె.డి.చక్రవర్తి హీరోలుగా నటిస్తున్న చిత్రం 'ఆల్ ది బెస్ట్'. లక్కీ శర్మ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రాన్ని జె.సాంబశివరావు నిర్మిస్తూంటే జె.డి.చక్రవర్తి దర్శకత్వం వహిస్తున్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ ''నేనూ, జేడీ కలిసి నటించిన 'వన్ బై టు', 'ఎగిరేపావురమా' చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్నాయి. మేమిద్దరం కలిసి చాన్నాళ్ల తరవాత ఓ సినిమా చేయడం ఆనందంగా ఉంది. రెండున్నర గంటలు సరదాసరదాగా సాగే కథ ఇది'' అన్నారు. ''ఓ సందర్భంలో 'నీ దర్శకత్వంలో నేను నటిస్తా' అన్నాడు శ్రీకాంత్. అదిప్పుడు నిజం కావడం ఆనందంగా ఉంది. తను కథ కూడా వినకుండా చిత్రాన్ని అంగీకరించాడు. కథంతా ఆయన పాత్రపైనే నడుస్తుంది. ఎవరు ఎవరికి ఆల్ ది బెస్ట్ చెప్పారు? ఎందుకు చెప్పారు అనేది ఇందులో కీలకాంశం అన్నారు'' దర్శకుడు. ఈ చిత్రంలో చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రదీప్‌రావత్, కృష్ణ భగవాన్, బ్రహ్మాజీ తదితరులు ఇతర పాత్రధారులు. మాటలు: కృష్ణమోహన్ చల్లా, ఛాయాగ్రహణం: జి.శివకుమార్, సంగీతం: హేమచంద్ర.


Click it and Unblock the Notifications











