»   » వాటే సాలిడ్ లుక్... విలన్ గా శ్రీకాంత్ ఇలా ఉండబోతున్నాడా?

వాటే సాలిడ్ లుక్... విలన్ గా శ్రీకాంత్ ఇలా ఉండబోతున్నాడా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఈ మధ్య హీరోల క్రేజ్ తగ్గడంతో .. యూ టర్న్ తీసుకుంటూ నెగిటివ్ పాత్రలు చేయడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విలన్ గా సుమన్, జగపతి బాబు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. జగపతి బాబు 'లెజెండ్'లో విలన్ అవతారం ఎత్తినప్పటి నుంచి ఈ పాత్రలకు క్రేజ్ పెరిగింది.

హీరో రాజశేఖర్ కూడా

హీరో రాజశేఖర్ కూడా

సీనియర్ హీరో రాజశేఖర్ కూడా విలన్ వేషం మీద మోజు పడుతున్నాడు. ఇప్పుడు అయన దారిలో మరో హీరో టర్న్ తీసుకున్నాడు .. ఆయనే హీరో శ్రీకాంత్. హీరోగా కొనసాగుతున్నప్పుడే క్యారెక్టర్ రోల్స్ చేసిన శ్రీకాంత్ కూడా పవర్ ఫుల్ విలన్ పాత్రల్లో కనిపించాలని తహతహలాడుతున్నాడు.

నాగచైతన్య మూవీలో

నాగచైతన్య మూవీలో

ఈ మధ్య శ్రీకాంత్ కు క్రేజ్ తగ్గడంతో ఆయనకు పెద్దగా హీరోగా అవకాశాలు రావడం లేదు .. దాంతో నెగిటివ్ పాత్రలు చేయడానికి సిద్ధం అయ్యాడు. కృష్ణ మరిముత్తు దర్శకత్వంలో నాగచైతన్య ఓ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మూవీలోనే విలన్ గా కనిపించనున్నాడు శ్రీకాంత్.

 కేరక్టర్ వేషాలతో కూడా

కేరక్టర్ వేషాలతో కూడా

సీనియర్ హీరో శ్రీకాంత్.. రెండు దశాబ్దాలకు పైగా హీరో పాత్రలను చేసేశాడు. ఈ మధ్య కేరక్టర్ వేషాలతో కూడా అలరించాడు. రామ్ చరణ్ మూవీ గోవిందుడు అందరివాడే.. బన్నీ సరైనోడు వంటి చిత్రాల్లో కేరక్టర్ ఆర్టిస్ట్ గా కనిపించాడు. ఇప్పుడీ విలన్ అవతారంలోకి మారిపోతున్నాడు.

ఫుల్ గా గడ్డం పెంచి

ఫుల్ గా గడ్డం పెంచి

ప్రస్తుతం కన్నడంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు శ్రీకాంత్. ఆ మూవీ కోసం ఫుల్ గా గడ్డం పెంచి మేకోవర్ అయ్యాడు. నాగచైతన్య సినిమాలో కూడా అదే గెటప్ తో కనిపించనున్నాడు. మరి మరోసారి విలన్ గా మారుతున్న ఈ సీనియర్ హీరోకి ఎలాంటి బ్రేక్ వస్తుందో.. చూడాలి!

ఫొటో రిలీజ్ చేశాడు

ఫొటో రిలీజ్ చేశాడు

అన్నట్టు ఈ గెటప్ తో ఆ మధ్య శ్రీకాంత్ పై ఓ ఫొటోషూట్ కూడా జరిగింది. పుట్టినరోజు సందర్భంగా ఆ ఫొటో కూడా రిలీజ్ చేశాడు శ్రీకాంత్. ఈ లుక్ అందరినీ ఆకట్టుకుంది. టాలీవుడ్ లో కొత్త విలన్స్ కోసం ఎప్పుడూ వెతుకులాట ఉంటుంది కాబట్టి.. వెంటనే విలన్ ఆఫర్ కూడా వచ్చేసింది. చైతుకు మెయిన్ విలన్ గా నటించబోతున్నాడు శ్రీకాంత్.

విలన్ రోల్స్ కొత్తేమీ కాదు

విలన్ రోల్స్ కొత్తేమీ కాదు

నిజానికి శ్రీకాంత్ కు విలన్ రోల్స్ కొత్తేమీ కాదు. కెరీర్ స్టార్టింగ్ లో అన్నీ నెగిటివ్ రోల్స్ లోనే కనిపించాడు. తాజ్ మహల్ తో హీరోగా కుదురుకుని.. పెళ్లి సందడితో బోలెడంత ఇమేజ్ సంపాదించేసుకున్నాడు. మళ్లీ ఇన్నేళ్లకు విలన్ రోల్ లో నటించబోతున్నాడు శ్రీకాంత్. ఇప్పటికే విలన్.. కేరక్టర్ ఆర్టిస్ట్ గా మారిన జగపతిబాబు.. పలువురు సీనియర్ హీరోలకు మార్గదర్శకుడు అయిపోయాడు.

English summary
Hero Srikanth is appearing as a villain in Naga Chaitanya's upcoming film. It is known that Naga chaitanya is doing a film in the direction of Krishna Marimuthu. He is going to be the main villain in this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu