అక్షర ఆయుధంతో పోరాటం (విరోధి ప్రివ్యూ)

By Srikanya

శ్రీకాంత్, కమిలినీ ముఖర్జీ కాంబినేషన్ లో రూపొందిన విరోధి చిత్రం ఈ రోజు(శుక్రవారం)విడుదలవుతోంది. అక్షరమే ఆయుధంగా బతికే వ్యక్తి సిన్సియర్ జర్నలిస్ట్ జయదేవ్‌ (శ్రీకాంత్‌). నక్సలిజం, ప్రభుత్వ విధానాలపై మీద అతనికంటూ నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి. వాటికి విరుద్ధమైన పరిణామాలు సంభవించినప్పుడు జయదేవ్‌ ఎలా స్పందించాడు. కలం బలం ఉపయోగించి ఈ వ్యవస్థని ఎలా సరిదిద్దాడు అనేదే కథ. జయదేవ్‌కి నక్సలైట్‌ నాయకుడు(అజయ్‌)కీ ఉన్న సంబంధం ఏమిటనే పాయింటు చుట్టూ కథ తిరుగుతుంది. ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ ఈ సినిమాలో సైద్ధాంతికపరమైన చర్చలేం ఉండవు. కానీ ప్రతి సన్నివేశం మనల్ని ఆలోచింపజేస్తుంది. కథ, కథనాలు ఈ చిత్రానికి బలం అన్నారు.శ్రీకాంత్ కూడా ఈ చిత్రంపై మంచి అంచనాలు పెట్టుకున్నారు.షో,మిస్సమ్మ వంటి చిత్రాలు రూపొందించిన నీలకంఠ రీఎంట్రి ఇస్తూ డైరక్ట్ చేసిన చిత్రం ఇది

సంస్థ: మేకా మీడియా
నటీనటులు: శ్రీకాంత్‌, కమలినీ ముఖర్జీ, ఆహుతి ప్రసాద్‌, అజయ్‌, నాగినీడు, శివాజీ రాజా, కమల్‌ కామరాజు, శ్రీరమ్య తదితరులు.
నిర్మాత: అనిల్‌ మేకా
దర్శకత్వం: నీలకంఠ

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X