బాలకృష్ణ ‘శ్రీమన్నారాయణ' ఆడియో రిలీజ్ డేట్ ఖరారు
బాలకృష్ణ కథానాయకుడిగా రవి చావలి దర్శకత్వంలో 'శ్రీమన్నారాయణ' చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఆడియోని ఆగస్టు 6 ని విడుదల చేయటానికి నిర్ణయించారు. చక్రి ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో బాలకృష్ణ జర్నలిస్టు గా కనిపిస్తారు. ఈ చిత్రం రిలీజ్ ని ఆగస్టు రెండో వారంలో చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ప్రబాస్ చిత్రం రెబెల్ కు క్లాష్ కాకుండా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నారు.
ఇక ఈ చిత్రం అడ్వంచరస్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నట్లు దర్శకుడు రవిచావలి తెలిపారు. ఈ చిత్రంలో వుండే ఆరుగురు ప్రతినాయకులకి, బాలకృష్ణకు మధ్య జరిగే పోరాటాలు ఆసక్తికరంగా వుంటాయి, ఆయన స్టయిల్‌లో వుంటూనే అటు క్లాస్‌ని, ఇటు మాస్‌ని అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే రీతిలో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామన్నారు.
ఆర్ఆర్ మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై 'మిరపకాయ్' నిర్మాత రమేష్ పుప్పాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ...'మలేషియాలో తీసిన ఫైట్, సాంగ్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. ఈ షెడ్యూల్‌లో చేసిన వర్క్ 'శ్రీమన్నారాయణ'కు హైలెట్ అవుతుంది. బాలకృష్ణతో శ్రీమన్నారాయణ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించడం చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకులు అభిమానులు బాలయ్య నుంచి ఎక్స్‌పెక్ట్ చేసే అన్ని అంశాలు 'శ్రీమన్నారాయణ'లో ఉంటాయి అన్నారు.
బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇసా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్.నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్ సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్ : రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి.చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు, రామ్మోమన్, నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.


Click it and Unblock the Notifications











