ఆగస్టు 6న బాలకృష్ణ ‘శ్రీమన్నారాయణ’ ఆడియో
హైదరాబాద్: నటసింహం బాలకృష్ణ కథానాయకుడిగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ సమర్పణలో ఎల్లో ఫ్లవర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత రమేష్ పుప్పాల రవికుమార్ చావలి దర్శకత్వంలో నిర్మిస్తోన్న 'శ్రీమన్నారాయణ' నిర్మాణం పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత రమేష్ పుప్పాల మాట్లాడుతూ 'మా హీరో బాలకృష్ణ అందించిన సహకారంతో అనుకున్న షెడ్యూల్ లో పర్ ఫెక్టుగా 'శ్రీమన్నారాయణ' చిత్రం షూటింగ్ పూర్తయింది. పవర్ ఫుల్ జర్నలిస్టుగా బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ హైలెట్ గా రూపొందిన 'శ్రీమన్నారాయణ' 2012 మరో సూపర్ హిట్ చిత్రంగా ప్రేక్షకుల అపూర్వ ఆదరణ అందుకుంటుందన్న నమ్మకం నాకు ఉందన్నారు.
'సింహా' తర్వాత బాలకృష్ణ కాంబినేషన్లో చక్రి ఈ చిత్రానికి చాలా అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆడియో చాలా పెద్ద హిట్టవుతుంది. ఆగస్టు 6న ఈచిత్రం ఆడియోను హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో ఆవిష్కరిస్తున్నాం, ఆగస్టు చివరి వారంలోనే వరల్డ్ వైడ్ గా 'శ్రీమన్నారాయణ' చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అన్నారు.
బాలకృష్ణ, పార్వతి మెల్టన్, ఇషా చావ్లా, విజయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్య కృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి. సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్. సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్: రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి. చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు. నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.


Click it and Unblock the Notifications











