‘శ్రీమన్నారాయణ’కు A సర్టిఫికెట్ (ఆ.. సీన్ల వల్లనే?)
హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమా 'శ్రీమన్నారాయణ' సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈచిత్రానికి 'A' సర్టిఫికెట్ జారీ చేసారు. సాధారణంగా చిన్న పిల్లలు చూడకూడనిహింస, రొమాంటిక్ సీన్లు ఓవర్‌గా ఉంటేనే 'A' సర్టిఫికెట్ జారీ చేస్తారు. దీన్ని బట్టి ఈచిత్రంలో మాంచి యాక్షన్ సీన్లు, కైపెక్కించే రొమాంటిక్ సీన్లు ఉంటాయని స్పష్టం అవుతోంది.
ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న 'శ్రీమన్నారాయణ' ఆగస్టు 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఆడియో మంచి విజయం సాధించిన నేపథ్యంలో ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్‌ని ఆగస్టు 26న హైదరాబాద్ లో గ్రాండ్ గా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.


Click it and Unblock the Notifications











