twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    జర్నలిస్టు ప్రతీకారం.. (శ్రీమన్నారాయణ ప్రివ్యూ)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా హీరో హీరోయిన్లుగా ఆర్.ఆర్. మూవీమేకర్స్ సమర్పణలో రవికుమార్ చావలి దర్శకత్వంలో రమేష్ పుప్పాల నిర్మిస్తున్న 'శ్రీమన్నారాయణ' ఈ రోజు విడుదలైంది. బాలయ్య ఇమేజ్ కు తగిన విధంగా ఫుల్ మాస్ మూవీగా ఈచిత్రాన్ని తెరకెక్కించారు.

    ఈ చిత్రంలో బాలకృష్ణ జర్నలిస్టు పాత్ర పోషించారు. సినిమా మొత్తం రూ. 5 వేల కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. శ్రీమన్నారాయణ(బాలకృష్ణ) తండ్రి నారాయణమూర్తి(విజయ్ కుమార్) రైతులకు సహాయం చేయడం కోసం జై కిసాన్ ట్రస్టు స్థాపించి రూ. 5వేల కోట్ల విరాళాలు సేకరిస్తారు. అయితే ఈ డబ్బును కాజేయడానికి...మినిస్టర్ బైల్ రెడ్డి(జయ ప్రకాష్ రెడ్డి), బ్యాంకు మేనేజర్ రాజన్ (కోట), డాక్టర్ శ్రీకర్ ప్రసాద్(బాపినీడు), ఐజ మార్తాండ్(రావు రమేష్), హర్షత్ కొటారి(సురేష్), పులికేశవ్ రెడ్డి(సుప్రీత్) పథకం వేస్తారు. నారాయణ మూర్తి చావుకు అయన కొడుకు శ్రీమన్నారాయణే కారణమంటూ జైలుకు పంపుతారు. మరి శ్రీమన్నారాయణ తన తండ్రి కోరికను ఎలా నెరవేర్చాడు. వారిపై ప్రతీకారం తీర్చుకుని 5 వేల కోట్లను ఎలా రక్షించాడు అనేది తర్వాతి కథ.

    బాలయ్య అభిమానులు కోరుకునే అన్ని మాస్ మసాలా అంశాలతో ఈచిత్రాన్ని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలయ్య పేల్చిన డైలాగులు అభిమానుల్లో అంచనాలు పెంచేసాయి. ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి. సినిమా పూర్తి విశ్లేషణ మరికాసేపట్లో మాక్రిటిక్స్ మీకు అందిస్తారు.

    English summary
    Natasimham Nandamuri Balakrishna's ‘Srimannarayana’ released today with high expectations. Balaiah played a journalist role that unearths the scam happening around him. Director Ravi Chavali inspired by the recent scams in India developed a powerful jurno role which he is playing for the first time.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X