బాలయ్య ‘శ్రీమన్నారాయణ’ టాక్ ఏంటి?
హైదరాబాద్: బాలకృష్ణ తాజా సినిమా 'శ్రీమన్నారాయణ' భారీ అంచనాల మధ్య రిలీజైంది. సింహా తర్వాత సరైన హిట్టు లేని బాలకృష్ణ ఈచిత్రంపై బోలెడు ఆశలు పెట్టుకున్నాడు. బాలయ్య అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకుని ఈచిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రవికుమార్ చావలి.
సినిమా టాక్ విషయానికొస్తే...ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే గత సినిమా అధినాయకుడుతో పోల్చితే బెటరనే వాదన వినిపిస్తోంది. సినిమాలో బాలయ్య చేసే యాక్షన్ సన్నివేశాలు హైలెట్ గా ఉన్నాయని, బాలయ్య చెప్పిన డైలాగులు కూడా బాగున్నాయని అంటున్నారు. అయితే కథలో కొత్తదనం లేక పోవడం, సస్పెన్స్ మిస్సవడంతో జరుగబోయే సీన్లు ముందే అర్థం కావడంతో ప్రేక్షకులు బోర్ ఫీలయ్యారు. కామెడీ పాళ్లు తగ్గడం కూడా సినిమాపై ఎఫెక్ట్ పడింది. అయితే బాలయ్య మార్కు సినిమాలను ఇష్టపడే అభిమానుల నచ్చుతుందని అంటున్నారు.
ప్లస్ పాయింట్స్
బాలయ్య పెర్ఫార్మెన్స్
హీరోయిన్స్ గ్లామర్, సాంగ్స్
సినిమాటోగ్రఫీ
ఎడిటింగ్
చక్రి మ్యూజిక్
డైలాగ్స్
యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్
బోరింగ్ కథనం
బాలయ్య డాన్స్
విలన్లు బలంగా లేక పోవడం
కామెడీ పాళ్లు తగ్గడం
క్లైమాక్స్ వీక్ గా ఉండటం
బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.


Click it and Unblock the Notifications











