twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    దుర్మార్గులే బాలయ్య టార్గెట్-26న డిస్క్ పంక్షన్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నందమూరి నటసింహం తాజాగా నటిస్తున్న చిత్రం 'శ్రీమన్నారాయణ'. యాక్షన్-డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈచిత్రానికి రవి చావాలి దర్శకత్వం వహించగా పుప్పాల రమేష్ ఎల్లో ఫ్లవర్స్ బేనర్ పై నిర్మించారు. చక్రి సంగీతం అందించిన ఈ చిత్రం ఆడియో మంచి విజయం సాధించడంతో ఆగస్టు 26న ప్లాటినమ్ డిస్క్ ఫంక్షన్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    అన్ని కార్యక్షికమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల చివరి వారంలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఇషాచావ్లా, పార్వతీమెల్టన్ కథానాయికలు. బాలకృష్ణ చిత్ర విశేషాలు తెలియజేస్తూ 'బాధ్యతాయుతమైన జర్నలిస్టు పాత్రను తొలిసారిగా పోషించడం గర్వంగా వుంది. నా పాత్ర చిత్రీకరణ గత చిత్రాలకు పూర్తి వైవిధ్యంగా వుంటుంది. పవిత్రమైన టైటిల్‌తో ఈ సినిమా రావడం ఆనందంగా వుంది. నా అభిమానుల్ని అలరించే అంశాలన్నీ ఈ చిత్రంలో వుంటాయి' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ 'రైతులను మోసం చేస్తున్న దుర్మార్గులపై ఓ జర్నలిస్టు సాగించే పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం. నటుడిగా బాలకృష్ణ విశ్వరూపం చూపించారు' అన్నారు. నిర్మాత రమేష్‌పుప్పాల మాట్లాడుతూ 'ఇటీవల విడుదలైన ఆడియోకు శ్రోతల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. చక్రి స్వరాలు బాలకృష్ణ అభిమానులతో పాటు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. మా సంస్థలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఈ నెల చివరివారంలో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అన్నారు.

    విజయ్‌ కుమార్, సురేష్, వినోద్‌ కుమార్, జయప్రకాష్‌ రెడ్డి, కృష్ణభగవాన్, ఆహుతిప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: ఘటికాచలం, సినిమాటోక్షిగఫీ: టి.సురేందర్‌ రెడ్డి, సంగీతం: చక్రి, కథ-స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: రవికుమార్ చావలి.

    English summary
    The platinum disc function of Natasimha Nandamuri Balakrishna's upcoming action drama "Srimannarayana" would be held on August 26 in Hyderabad. Balayya would be seen as a powerful TV journalist in this movie, which is directed by Ravikumar Chavali. Isha Chawla and Parvati Melton have played the lead roles in the film, which is gearing for a grand release in the last week of August.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X