షిరిడి సాయి ఎఫెక్ట్...పీకేసిన బాలయ్య సినిమా...నిర్మాత ధర్నా
హైదరాబాద్: విజయవంతంగా ప్రదర్శితం అవతున్న 'శ్రీమన్నారాయణ' చిత్రాన్ని తీసేసారని ఆరోపిస్తూ ఆ చిత్ర నిర్మాత పుప్పాల రమేష్ కూకట్ పల్లిలోని అర్జున థియేటర్ వద్ద గురువారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ధర్నా కార్యక్రమంలో దర్శకుడు రవి చావలితో పాటు బాలయ్య అభిమానులు పాల్గొన్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడి చేరుకుని వారిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఆగస్టు 30న బాలకృష్ణ నటించిన 'శ్రీమన్నారాయణ' చిత్రం విడుదల కాగా.... ఆ చిత్రాన్ని తీసేసి నాగార్జున నటించిన 'షిరిడి సాయి' చిత్రాన్ని నేటి నుంచి ప్రదర్శిస్తున్నారు. దీంతో ఆగ్రహించిన దర్శక నిర్మాతలు, అభిమానులు ఆందోళన చేపట్టారు.
సింహా తర్వాత సరైన హిట్టు లేని బాలకృష్ణకు శ్రీమన్నారాయణ చిత్రం కాస్త ఫర్వాలేదనిపించినా... సింహా రేంజిని మాత్రం అందుకోలేదు. బాలయ్య అభిమానులు కోరుకునే అన్ని కమర్షియల్ అంశాలు ఉండేలా చూసుకుని ఈచిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు రవికుమార్ చావలి. సినిమా టాక్ విషయానికొస్తే... ఈ చిత్రం యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే బాలయ్య గత సినిమా అధినాయకుడుతో పోల్చితే బెటర్ టాక్ తెచ్చుకుంది.
బాలకృష్ణ, పార్వతీ మెల్టన్, ఇషా చావ్లా, విజయ్‌కుమార్, సురేష్, వినోద్‌కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్‌రెడ్డి, కృష్ణ్భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్యకృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతంరాజు, ఆర్ట్: నాగేందర్, నిర్మాత: రమేష్ పుప్పాల, కథ, కథనం, దర్శకత్వం: రవికుమార్ చావలి.


Click it and Unblock the Notifications











