»   » శ్రీమంతుడు క్రేజ్: మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా (ఫోటోస్)

శ్రీమంతుడు క్రేజ్: మహేష్ బాబు ఫ్యాన్స్ హంగామా (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు ‘శ్రీమంతుడు' సినిమా ఆగస్టు 7న గ్రాండ్ గా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. సినిమా విడుదలకు మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఎక్కడ చూసినా ‘శ్రీమంతుడు' సినిమా సందడే కనిపిస్తోంది. ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ జోస్‌తో హంగామా సృష్టిస్తున్నారు.

‘శ్రీమంతుడు' సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా విడుదలవుతోంది. తమిళంలో ఈ చిత్రాన్ని ‘సెల్వందన్' పేరుతో విడుదల చేస్తున్నారు. తమిళంలో కూడా ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే సాగింది.


సినిమా ట్రైలర్, పోస్టర్లు విడుదలైనప్పటి నుండే సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అభిమాన సంఘాలు సోషల్ మీడియా ద్వారా ఈ సినిమాకు మరింత ప్రచారం కల్పించారు. తెలుగు రాష్ట్రాల్లోని అభిమానులతో పాటు, విదేశాల్లో ఉన్న మహేష్ బాబు అభిమానులు ఓ రేంజిలో హంగా చేస్తున్నారు.


ఇక థియేటర్ల వద్ద అభిమానులు మహేష్ బాబు భారీ కౌట్లు, బేనర్లతో పండగ వాతావరణం సృష్టించారు. స్లైడ్ షోలో మహేష్ బాబు అభిమానులు సృష్టిస్తున్న హంగామాపై ఓ లుక్కేయండి....


శ్రీమంతుడు స్పెషల్

శ్రీమంతుడు టైటిల్ తో హెయిర్ కట్ చేయించుకున్న ఓ అభిమాని.


అమెరికాలో..

అమెరికాలో శ్రీమంతుడు క్రేజ్ ఇలా....


థియేటర్లు

శ్రీమంతుడు పోస్టర్లు, మహేష్ బాబు కటౌట్లతో థియేటర్లు అలంకరించబడ్డాయి.


అమెరికా ఫ్యాన్స్

అమెరికాలోని తెలుగు వారు, మహేష్ బాబు అభిమానులు ఇలా....


వీకెండ్ హౌస్ ఫుల్

ఈ వీకెండ్ వరకు థియేటర్లు హౌస్ ఫుల్ అంటూ బోర్డు పెట్టిన దృశ్యం.
English summary
Superstar Mahesh Babu's Srimanthudu is all set for a grand release worldwide on August 7 and the countdown has come to few hours.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu