మహేష్ బాబు ‘శ్రీమంతుడు’... అనుకున్నట్లే ఇస్తారా?
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు' చిత్రం ఆగస్టు 7న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం ఈ నెల 31న సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోబోతోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా సెన్సార్ సర్టిఫికెట్ ‘U' వస్తుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు.
2015 సంవత్సరంలోని విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు.

జగపతి బాబు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సుకన్య, సంపత్ రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి సంయుక్తంగా మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో...జి మహేష్ బాబు ఎంట్టెన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











