»   » శ్రీమంతుడు: మహేష్ బాబు లుక్ సూపర్బ్ (ఫోటోస్)

శ్రీమంతుడు: మహేష్ బాబు లుక్ సూపర్బ్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు' ఆగస్టు 7న గ్రాండ్‌గా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శ్రీమంతుడు సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లు, లొకేషన్ స్టిల్స్ విడుదల చేసారు.

ఈచిత్రం ఈ నెల 31న సెన్సార్ కార్యక్రమాలను జరుపుకోబోతోంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రంగా సెన్సార్ సర్టిఫికెట్ ‘U' వస్తుందని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. 2015 సంవత్సరంలోని విడుదలవుతున్న భారీ చిత్రాల్లో ఇదీ ఒకటి. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మహేష్ బాబు, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా నటించారు. దేవిశ్రీ ప్రసాద్ ఈచిత్రానికి సంగీతం అందించారు.


జగపతి బాబు, బ్రహ్మానందం, రాజేంద్రప్రసాద్, సుకన్య, సంపత్ రాజ్, హరీష్ ఉత్తమన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, రవి శంకర్ యలమంచిలి, మోహన్ చెరుకూరి సంయుక్తంగా మైత్రి మూవీ మేకర్స్ బేనర్లో...జి మహేష్ బాబు ఎంట్టెన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు.


ఈ సినిమా కోసం మహేష్ బాబు ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదు. ఆయన నిర్మాణ సంస్థ జి.మహేష్ బాబు ఎంటర్టెన్మెంట్స్ ప్రై.లి, మైత్రి మూవీస్ సినిమా ద్వారా వచ్చిన లాభాలను షేర్ చేసుకుంటాయి. ‘శ్రీమంతుడు' సినిమాకు సంబంధించిన మార్కెటింగ్ విషయాలను మహేష్ బాబు భార్య నమ్రత దగ్గరుండి చూసుకుంటున్నారు.


ఈ విషయమై ప్రముఖ ఆంగ్లపత్రికతో నమ్రత మాట్లాడుతూ...‘శ్రీమంతుడు మార్కెటింగ్ వ్యవహారాలను నేను చూసుకుంటున్నాను. ప్రస్తుతం అందుకు సంబంధించి కాస్త బిజీగా గడుపుతున్నాను. ఈ పనులు చూసుకోవడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది' అని నమ్రత వెల్లడించారు.


స్లైడ్ షోలో శ్రీమంతుడు కొత్త పోస్టర్లు, లొకేషన్ స్టిల్స్...


శ్రీమంతుడు
  

శ్రీమంతుడు

దర్శకుడు కొరటాల శివతో కలిసి సెట్లో మహేష్ బాబు.


మహేష్, శృతి
  

మహేష్, శృతి

మహేష్ బాబు, శృతి హాసన్ సూపర్ హాట్ స్టిల్.


కొత్త పోస్టర్
  

కొత్త పోస్టర్

సినిమా ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన కొత్త పోస్టర్.


ప్రివ్యూ..
  

ప్రివ్యూ..

షూటింగ్ అనంతరం ప్రివ్యూ చూస్తున్న మహేష్, శివ, శృతి.


మహేష్ బాబు
  

మహేష్ బాబు

సినిమా సెట్లో మహేష్ బాబు...


చిత్ర బృందం
  

చిత్ర బృందం

శ్రీమంతుడు చిత్ర బృందంతో కలిసి మహేష్ బాబు, కొరటాల శివ


మహేష్ బాబు లుక్
  

మహేష్ బాబు లుక్

శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు లుక్ సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్.


శృతి హాసన్
  

శృతి హాసన్

సినిమా సెట్లో శృతి హాసన్ సెల్పీ....


మహేష్ బాబు
  

మహేష్ బాబు

శ్రీమంతుడు చిత్ర నటుడితో కలిసి మహేష్ బాబు.


రాజేంద్రుడితో
  

రాజేంద్రుడితో

రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా, కాదంబరి కిరణ్ తో కలిసి మహేష్ బాబు.


జగపతి బాబు
  

జగపతి బాబు

శ్రమంతుడు సినిమాలో జగపతి బాబు లొకేషన్ స్టిల్.


 


Please Wait while comments are loading...