»   » అంచనాలను మించింది (శ్రీమంతుడు సక్సెస్ మీట్ ఫోటోస్)

అంచనాలను మించింది (శ్రీమంతుడు సక్సెస్ మీట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మహేష్ బాబు, శృతి హాసన్, జగపతి బాబు, రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలు పోషించిన ‘శ్రీమంతుడు' భారీ విజయం సాధించడంతో యూనిట్ సభ్యులంతా హ్యాపీగా ఉన్నారు. సినిమా విడుదలైన 5 రోజుల్లో రూ. 50 కోట్ల కలెక్షన్ క్రాస్ చేసింది. ఈ నేపథ్యంలో దర్శకుడు కొరటాల శివ, హీరోయిన్ శృతి హాసన్, జగపతి బాబు, నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ మీడియాతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

ఈ సందర్భంగా జగపతి బాబు మాట్లాడుతూ...సినిమా పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకున్నాం కానీ ఇంత పెద్ద సక్సెస్‌ అవుతుందని అనుకోలేదు. ప్రేక్షకుల నుండి యూనానిమస్ రెస్పాన్స్‌ వచ్చింది. అప్పట్లో నేను నటించిన శుభలగ్నం సినిమా వర్షాకాలంలో రిలీజ్ అయినా ప్రేక్షకులు సూపర్ హిట్ చేశారో ఈ సినిమాని అంతకంటే పెద్ద హిట్ చేశారు. ఈ శ్రీమంతుడు సక్సెస్ తో యూనిట్ కి పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. అందకు కారణమైన ప్రేక్షకులకు థాంక్స్ అని అన్నారు.

స్లైడ్ షోలో ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ కు సంబంధించిన మరిన్ని వివరాలు...

పార్క్ హయత్ హోటల్ లో మీటింగ్

పార్క్ హయత్ హోటల్ లో మీటింగ్


పార్క్‌ హయత్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయు సమావేశంలో జగపతి బాబు, శృతిహాసన్, కొరటాల శివ నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్(సివిఎం)లు పాల్గొన్నారు.

అనుకున్న దానికంటే పెద్ద హిట్

అనుకున్న దానికంటే పెద్ద హిట్

దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ... మేం అందరం అనుకున్న దానికంటే సినిమా పెద్ద హిట్‌ అయిందికమర్షియల్‌ వాల్యూస్ తో కూడిన హానెస్ట్‌ మూవీ ఇదిముఖ్యంగా మహేష్ బాబుగారు క్యారెక్టర్ మలచిన విధం ప్రేక్షకులకు బాగా నచ్చింది. తమిళంలో కూడా సూపర్‌హిట్‌ టాక్‌తో సినిమా నడుస్తుంది. నా సినిమాతో మహేష్‌బాబుగారు తమిళంలో ఎంటర్‌ కావడం హ్యాపీగా ఉంది. సపోర్ట్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌ అని దర్శకుడు అన్నారు.

శృతి హాసన్

శృతి హాసన్

శృతిహాసన్‌ మాట్లాడుతూ ‘‘మహేష్‌బాబు ఎక్స్‌ట్రార్డినరీ యాక్టర్‌తో ఈ సినిమాలో నటించడం హ్యపీగా ఉంది, మెమరబుల్ మూవీగా నిలిచిపోయింది.'' అన్నారు.

మొదటి సినిమా హిట్

మొదటి సినిమా హిట్

తమ బ్యానర్లో వచ్చిన తొలి సినిమా భారీ విజయం సాధించడంతో చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్(సివిఎం) ఆనందం వ్యక్తం చేసారు. అభిమానులకు, ప్రేక్షకులకు థాంక్స్ చెప్పారు.

English summary
Srimanthudu Movie Press meet held today evening at Hyderabad.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu