మహేష్ బాబు ‘శ్రీమంతుడు’ కొత్త ఫోటోస్...
హైదరాబాద్: మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘శ్రీమంతుడు' ఆడియో ఈ నెల 18న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శ్రీమంతుడు సినిమాకు సంబంధించిన కొత్త పోస్టర్లు విడుదల చేసారు. ఈ సారి విడుదలైన పోస్టర్లలో హీరోయిన్ శృతి హాసన్ కూడా ఉంది.
ఈ చిత్రం ఆడియో పంక్షన్ కు సంభందించి పాస్ లుకు విపరీతమైన డిమాండ్ వచ్చింది. దీన్ని అడ్డం పెట్టుకుని కొందరు పాస్ లను అమ్ముతున్నారు. ఈ విషయమై చిత్రం నిర్మాతలు సీరియస్ గా తీసుకున్నారు. ట్విట్టర్ సాక్షిగా...అటువంటివి ఎంకరేజ్ చేయవద్దంటూ తెలియపరిచారు.


సినిమాను ఆగస్టు 7న విడుదల చేయబోతున్నారు. వాస్తవానికి జులై 17నే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ‘బాహుబలి' కోసం వాయిదా వేసుకున్నారు. ఇక ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని, టీజర్ ని ఇప్పటికే విడుదల చేశారు. ఫస్ట్ లుక్ లో సైకిల్‌పై స్త్టెలిష్‌గా కనిపిస్తున్న మహేష్ లుక్ కి మంచి స్పందన వచ్చింది. మహేష్ బాబు సరసన శృతి హాసన్ హీరోయిన్. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, మోహన్ (సీవీఎమ్) నిర్మిస్తున్నారు.

ఈ సినిమాకు మహేష్ బాబు కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. జి.మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సొంతంగా నిర్మాణ సంస్థను ప్రారంభించారు. 'శ్రీమంతుడు' పోస్టర్‌లో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థతో పాటు, మహేష్‌బాబు నిర్మాణ సంస్థ లోగో కూడా ముద్రించారు.


Click it and Unblock the Notifications











