»   » సూపర్: మరో రేర్ రికార్డు అంచున ‘శ్రీమంతుడు’

సూపర్: మరో రేర్ రికార్డు అంచున ‘శ్రీమంతుడు’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘శ్రీమంతుడు' కలెక్షన్ల పరంగా దూసుకెలుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి తర్వాత అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డుల కెక్కింది. మూడో వారంలోనూ సినిమా మంచి కలెక్షన్లు రాబడుతోంది.

మహేష్ బాబు సినిమాలకు యూఎస్ఏ మార్కెట్లో మంచి మార్కెట్ ఉందని మరోసారి రుజువైంది. త్వరలో ఈ చిత్రం ఇక్కడ $3 మిలియన్ మార్కును అందుకునేందుకు సిద్ధంగా ఉంది. శ్రీమంతుడు చిత్రం లాస్ట్ సండే వరకు $2,821,216 వసూలు చేసింది. 2015లో యూఎస్ఏలో అత్యధిక గ్రాస్ సాధించిన ఇంటర్నేషనల్ చిత్రాల్లో 12వ స్థానంలో ఉంది.


Srimanthudu all set to cross the $3 million

మహేష్ కెరీర్ లోనే టాప్ గా నిలిచిన దూకుడు చిత్రం 56 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. దాన్ని బ్రేక్ చేస్తూ శ్రీమంతుడు చిత్రం 17 రోజులకే 75.97 సాధించి ట్రేడ్ లో అందరినీ ఆశ్చర్యంలో పడేసింది. సినిమా మంచి వసూళ్లు సాధించడంతో పాటు ఊరికి మంచి చేయాలనే కాన్సెప్టును ఎంచుకున్న మహేష్ బాబును అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మహేష్ బాబు కెరీర్లోనే ఇది బెస్ట్ చిత్రంగా నిలిచింది.


ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, అలీ, సుబ్బరాజు, వెన్నెల కిషోర్‌, శివాజీ రాజా, కాదంబరి, ముకేష్‌ రుషి, సంపత్‌, హరీష్‌, ఏడిద శ్రీరాం, తులసి, సుకన్య, సీతారాం, సన ఇతర తారాగణం. ఈ చిత్రానికి పాటలు: రామజోగయ్యశాస్త్రి, డ్యాన్స్‌: రాజుసుందరం, దినేష్‌, బాస్కో సీజర్‌, థ్రిల్స్‌: అనల్‌ అరసు, అసిస్టెంట్‌ డైరెక్టర్స్‌: త్రివేది, అసోసియేట్‌ డైరెక్టర్స్‌: శేషు, జయరాం రవి, కో డైరెక్టర్స్‌: వాసు, తులసి, చీఫ్‌ కో డైరెక్టర్స్‌: పి.వి.వి. సోమరాజు, ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్‌: ఎ.యస్‌.ప్రకాష్‌, కెమెరా: మది, సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: చంద్రశేఖర్‌ రావిపాటి, నిర్మాతలు: నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సి.వి.ఎమ్‌), కథ-మాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: కొరటాల శివ.

English summary
In the US, Srimanthudu is inching towards a rare milestone as the film is all set to cross the $3 million mark by this weekend. Until the last Sunday, Srimanthudu raked in $2,821,216 and stood in the 12th position among the 2015 highest grossing international films in the US.
Please Wait while comments are loading...