మొండికేస్తున్న యాంకర్ ప్రదీప్: ఇంటికి పోలీసులు, తనను లాగడంపై శ్రీముఖి ఫైర్!
Recommended Video

తెలుగు యాంకర్, టీవీ హోస్ట్ ప్రదీప్ డిసెంబర్ 31వ తేదీ రాత్రి అతిగా మధ్యం సేవించి కారు నడుపుతూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ అయిన సంగతి తెలిసిందే. పోలీసులు ఆయనపై కేసు నమోదు చేయడంతో పాటు కారు సీజ్ చేశారు. కౌన్సిలింగుకు రావాల్సిందిగా ఆదేశించారు. అయితే కౌన్సిలింగుకు ప్రదీప్ హాజరు కాలేదు.

ప్రదీప్ ఇంటికి పోలీసులు
మంగళవారమే ప్రదీప్ కౌన్సిలింగుకు హాజరు కావాల్సి ఉండగా.... బుధవారం ఉదయం 11 గంటల వరకూ హాజరు కాలేదని బేగంపేట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇనస్పెక్టర్ బలవంతయ్య వెల్లడించారు. ప్రదీప్ కోసం ఇద్దరు ట్రాఫిక్ పోలీసులను కూడా ఇంటికి పంపించామని తెలిపారు.

బుధవారం హాజరుకాని పక్షంలో...
సాంకేతికంగా ప్రదీప్‌కు శనివారం వరకూ కౌన్సెలింగ్ కు హాజరయ్యేందుకు అవకాశం ఉందని, అయితే తాము డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో దొరికిన వారికి రెండు రోజుల్లోపే కౌన్సెలింగ్ ను పూర్తి చేస్తున్నామని, బుధవారం ప్రదీప్ కౌన్సెలింగ్ కు హాజరు కాకుంటే, ఈ విషయాన్ని కూడా చార్జ్ షీట్ రిపోర్టులో చేరుస్తామని పోలీసులు తెలిపారు.

జైలు శిక్ష పడే అవకాశం
డిసెంబర్ 31వ తేదీ రాత్రి బ్రీత్ ఎనలైజర్‌తో పోలీసులు ప్రదీప్‌ను పరీక్షించగా.... 178 పాయింట్లు చూపించింది. దీన్ని బట్టి సాధారణ స్థాయి కంటే ప్రదీప్ నాలుగైదు రెట్లు ఎక్కువ మధ్యం సేవించాడని తేలిపోయింది. దీనికి గాను ఆయనకు దాదాపు వారం రోజుల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అంటున్నారు.

ప్రదీప్ కారులో ఆ అమ్మాయి ఎవరు?
డిసెంబర్ 31 రాత్రి ప్రదీప్ పోలీసులకు దొరికిపోయిన సమయంలో ఆయన కారులో ఓ అమ్మాయి కూర్చుని ఉంది. ఆమె ఎవరు? అనే విషయమై సోషల్ మీడియాలో రకరకాల ప్రచారం జరిగింది. కార్లో ఉన్నది శ్రీముఖి అంటూ ఓ రూమర్ రావడంతో ఆమె స్పందించారు.

ప్రదీప్ కార్లో ఉన్నది నేను కాదు
యాంకర్ ప్రదీప్ కార్లో ఉన్నది తాను కాదని, వేరే అమ్మాయి అని.... తనను ఇందులోకి లాగితే ఊరుకునేది లేదని యాంకర్ శ్రీముఖి హెచ్చరించినట్లు సమాచారం.

ఇది దురదృష్టకరమే: శ్రీముఖి
ప్రదీప్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోవడం దురదృష్టకరమని, ఆ రోజు డ్రైవర్ అనారోగ్యంతో రాని కారణంగానే ప్రదీప్ కారు నడపాల్సి వచ్చిందని శ్రీముఖి వెల్లడించారు.


Click it and Unblock the Notifications











