సెక్స్‌ సీన్లు చేస్తే తప్పేంటీ ? బయటకూడా అలాగే చూస్తారా..?? : అవసరాల శ్రీనివాస్

సినిమాల్లో మర్డర్లు చేసిన వాడిని బయట కిల్లర్ అంటారా..? మరి హాట్ సీన్లలో నటిస్తే వారిపై ఎందుకు 'చీప్‌' అనే ముద్ర వేయాలి అంటూ అడిగేసాడు అవసరాల శ్రీనివాస్

''హంటర్‌' సినిమా ఫస్టాఫ్‌ చూడగానే చెయ్యాలా వద్దా అని ఆలోచించి ఆ క్యారెక్టర్‌ చెయ్యకూడదనుకున్నాను. అయితే సెకెండ్ హాఫ్ కి వచ్చే సరికి నా అభిప్రాయం మారిపోయింది. ఫ్రెండ్స్ మధ్య ఉండే సీన్లు చాలా ఎమోషనల్ గా ఉన్నాయి. ఇంతకు ముందు నేను చేసిన సినిమాలేంటి? ఈ కథేంటి అని ఆలోచించుకున్నాకే డిఫరెంట్‌గా వెళ్లాలని ఈ సినిమా చేశా. ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో భిన్నమైన సినిమా ఇది'' బాబు బాగా బిజీ గురించి చెబుతూ శ్రీనివాస్ అవసరాల ఇలా చెప్పాడు. అయితే...! ఈ సినిమా మాతృక హిందీలో వచ్చిన హంతర్ చూసిన వాళ్ళకీ, బాబు బాగా బిజీ ట్రైలర్ చూసినవాళ్ళకీ అర్థమయ్యింది మాత్రం ఇది ఇప్పటి వరకూ తెలుగులో రానంత గ్రాండ్ పక్కా అడల్ట్ కామెడీ సినిమా (సెక్స్ కామెడీ అనాలేమో)

అవసరాల ఎలా ఒప్పుకున్నాడు

అవసరాల ఎలా ఒప్పుకున్నాడు

" అయితే మనదగ్గర ఇలాంటి సినిమాలు తక్కువ కావటం, అందులోనూ అవసరాల ఇప్పటి వరకూ చేసిన పాత్రల స్వభావాలు వేరుగా ఉండటం తో అసలు ఈ సినిమా కి అవసరాల ఎలా ఒప్పుకున్నాడు అనే అనుమానం చాలా మందికే వచ్చినట్టుంది. బాబు బాగా బిజీ'లాంటి చిత్రం చేస్తున్నావని తెలిసి మీ తల్లిదండ్రులు ఏమన్నారు? అని కొందరు అడుగుతున్నారట.

 స్కోరెంత' అని అడిగే సీన్‌ వుండడంతో?

స్కోరెంత' అని అడిగే సీన్‌ వుండడంతో?

ఇది ఒక సినిమా అని, కేవలం నటించానని ఎందుకు గుర్తించడం లేదు అంటూ అవసరాల అడుగుతున్నాడు. ఆ సినిమాలో 'నా స్కోరెంత' అని అడిగే సీన్‌ వుండడంతో నిజ జీవితంలోను తనని ఆ ప్రశ్న అడిగేయవచ్చునని కొందరు భావిస్తున్నారని, అలా అడిగిన వాళ్లు కూడా వున్నారని ఆశ్చర్యపోయాడు.

 'చీప్‌' అనే ముద్ర ఎందుకు?

'చీప్‌' అనే ముద్ర ఎందుకు?

తన వరకు నటుడిగా ఛాలెంజ్‌ చేసే పాత్రలు వచ్చినపుడు ఖచ్చితంగా చేస్తానని, బాబు బాగా బిజీ ఆడినా, ఆడకపోయినా ఇది చేయడం పట్ల రిగ్రెట్‌ అవనని, అలా అని ఇకపై అన్నీ ఇలాంటి పాత్రలే చేస్తానని అనడం లేదు కదా. పాత్ర సినిమాని బట్టి బట్టి ఉంటుంది మనుషులు అలా మారరు. సినిమాల్లో మర్డర్లు చేసిన వాడిని బయట కిల్లర్ అంటారా..? మరి హాట్ సీన్లలో నటించినంత మాత్రాన బయట కూడా అదే దృష్టి తో ఎలా చూస్తారు? వారిపై ఎందుకు 'చీప్‌' అనే ముద్ర వేయాలి అంటూ అడిగేసాడు. .

భయపెడుతున్నారు

భయపెడుతున్నారు

బాహుబలి తర్వాత రిలీజ్‌ చేస్తున్నామని కొందరు భయపెడుతున్నారని, కానీ ఇది సరయిన సమయమని తన నిర్మాతలు, బయ్యర్లు భావిస్తున్నారని, ఆ రంగంలో వారికి అనుభవం వుంది కనుక వారి నమ్మకాన్ని నమ్ముతానని, ఇది కమర్షియల్‌గా వర్కవుట్‌ అయ్యే సినిమా అని నమ్ముతున్నానని చెప్పాడు.

'A' సర్టిఫికెట్, అడల్ట్స్ ఓన్లీ

'A' సర్టిఫికెట్, అడల్ట్స్ ఓన్లీ

తాజాగా సెన్సార్ ఫార్మాల్టీస్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ 'A' సర్టిఫికెట్ కేటాయించింది. 'A' సర్టిఫికెట్ కేటాయింపుతో ఈ సినిమా 'అడల్ట్స్ ఓన్లీ' మాత్రమే అని సెన్సార్ బోర్డ్ చెప్పకనే చెప్పింది. అంతేకాకుండా పలు సన్నివేశాలకి సెన్సార్ వాళ్లు కత్తెర వేసినట్టు తెలుస్తోంది.

టాక్ ఆఫ్ ది టౌన్

టాక్ ఆఫ్ ది టౌన్

ఇంకొన్ని సన్నివేశాలపై రీవర్క్ జరిగినట్టు సమాచారం. విడుదలకి ముందే ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ముఖ్యంగా ట్రైలర్, టీజర్లలో చూపించిన సన్నివేశాలు చూస్తే, సినిమాలో అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికెట్ కి అర్హత కలిగిన సన్నివేశాలు అనేకం వున్నాయని ఆడియెన్స్ సైతం ముక్కున వేలేసుకున్నారు. ఊహించినట్టుగానే ఇప్పుడు సెన్సార్ బోర్డ్ కూడా అదే ఏ సర్టిఫికెట్ జారీ చేసింది.

పబ్లిసిటీ బాగా ఊపందుకుంది

పబ్లిసిటీ బాగా ఊపందుకుంది

స్టిల్స్‌ అయితే ఇప్పటికే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిపోయాయి. పబ్లిసిటీ కూడా బాగా ఊపందుకుంది. ప్రస్తుతానికి 'బాహుబలి' మాత్రమే థియేటర్లలో ఉండటం, ఇంకే తెలుగు సినిమా థియేటర్లలో కన్పించకపోవడంతో, కొన్ని థియేటర్లలో అయినా 'బాబు బాగా బిజీ' పండగ చేసుకోవచ్చు.

ఈ శుక్రవారం విడుదల

ఈ శుక్రవారం విడుదల

ఇదో అడల్ట్‌ కంటెన్ట్‌ మూవీ. సో ఇంట్రెస్ట్‌ బాగానే క్రియేట్‌ కావొచ్చు. 'బాహుబలి'కి టిక్కెట్లు దొరకనివారికి ఆల్టర్‌నేట్‌గా తమ సినిమా కనిపిస్తుందనే ఆలోచన కూడా 'బాబు బాగా బిజీ' టీమ్‌లో ఉందేమో. అదే ధైర్యంతో ఈ సినిమాని ఈ శుక్రవారం విడుదల చేస్తున్నారు. చూద్దాం ఈ బాబు ధియేటర్లో ఎంత బిజీ అవుతాడో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X