హ్యాట్రిక్‌పై కన్నేశారు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నాగశౌర్య!
యంగ్ హీరో నాగశౌర్య, అవసరాల శ్రీనివాస్ లది హిట్ కాంబినేషన్. వీరిద్దరి మాబోలో వచ్చిన ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద లాంటి చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. దర్శకుడగా, నటుడిగా శ్రీనివాస్ అవసరాల దూసుకుపోతున్నాడు. శ్రీనివాస్ అవసరాల మరో చిత్రానికి రూపొందించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
శ్రీనివాస్ అవసరాల ఇటీవల నాగ శౌర్యకు ఓ కథని వినిపించాడట. కథ నచ్చడంతో నాగశౌర్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దర్శకుడిగా తన సత్తాని మరోమారు నిరూపించుకోవాలని శ్రీనివాస్ అవసరాల భావిస్తున్నాడు. ఇక నాగ శౌర్యకు ఛలో చిత్రం తర్వాత ఆ స్థాయి విజయం మాత్రం దక్కలేదు. వరుస ప్లాపులతో నాగశౌర్య సతమతమవుతున్నాడు.

శ్రీనివాస్ అవసరాల నేచురల్ స్టార్ నానితో ఓ చిత్రాన్ని చేసేందుకు ఆసక్తి చూపారు. కానీ నాని ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. దీనితో శ్రీనివాస్ అవసరాల నాగశౌర్యతో సినిమా చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ చిత్రానికి సంబందించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.


Click it and Unblock the Notifications











