For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Nootokka Jillala Andagadu Twitter Review: అవసరాల శ్రీనివాస్ సరికొత్త ప్రయోగం.. మూవీ ఎలా ఉందంటే!

  |

  ఏమాత్రం బ్యాగ్రౌండ్ లేకుండానే సినిమాల్లోకి ఎంట్రీ.. మొదట నటుడిగా తన సత్తాను చాటుకుని, ఆ తర్వాత దర్శకుడిగానూ సక్సెస్ అయ్యాడు టాలెంటెడ్ గాయ్ అవసరాల శ్రీనివాస్. 'అష్టాచెమ్మా' అనే చిత్రంతో నటుడిగా పరిచయం అయిన అతడు.. సుదీర్ఘమైన కెరీర్‌లో ఎన్నో చిత్రాల్లో విలక్షణమైన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. తద్వారా టాలీవుడ్‌లో మంచి పేరును తెచ్చుకున్నాడు.

  అప్పటి నుంచి వెనుదిరిగి చూడని అతడు హీరోగా, దర్శకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం 'నూటొక్క జిల్లాల అందగాడు' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ మూవీ ట్విట్టర్ రివ్యూపై ఓ లుక్కేద్దాం పదండి!

  ‘నూటొక్క జిల్లాల అందగాడు'గా వచ్చాడు

  ‘నూటొక్క జిల్లాల అందగాడు'గా వచ్చాడు

  విలక్షణ నటుడు అవసరాల శ్రీనివాస్ హీరోగా చేసిన మూవీనే ‘నూటొక్క జిల్లాల అందగాడు'. రాచకొండ విద్యా సాగర్ తెరకెక్కించిన ఈ మూవీలో రుహానీ శర్మ హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్‌, ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ స‌మ‌ర్పణ‌లో శిరీష్, రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగ‌ర్లమూడి నిర్మించారు. శక్తికాంత్ కార్తీక్ మ్యూజిక్ ఇచ్చాడు.

  టాప్‌ తీసేసి హీరోయిన్ హాట్ సెల్ఫీ: పెళ్లైన తర్వాత కూడా అందాలు మొత్తం చూపించిందిగా!

  సమస్యనే ప్రధానంగా తీసుకున్న శ్రీనివాస్

  సమస్యనే ప్రధానంగా తీసుకున్న శ్రీనివాస్

  ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది బాధ పడుతోన్న సమస్యల్లో బట్టతల ఒకటి. దీన్ని ప్రధానాంశంగా తీసుకుని తెరకెక్కించిన చిత్రమే ‘నూటొక్క జిల్లాల అందగాడు'. ఆరంభంలోనే వివాదం జరిగినట్లు చూపించి అవసరాల శ్రీనివాస్ దీనిని ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ట్రైలర్, టీజర్, పోస్టర్లతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. దీంతో ఈ చిత్రంపై ఆసక్తి పెరిగిపోయింది.

  గ్రాండ్‌ రిలీజ్... ప్రీ బిజినెస్ కూడా భారీగానే

  గ్రాండ్‌ రిలీజ్... ప్రీ బిజినెస్ కూడా భారీగానే

  తెలుగు రాష్ట్రాల్లో అవసరాల శ్రీనివాస్‌కు పెద్దగా మార్కెట్ లేదు. కానీ, ‘నూటొక్క జిల్లాల అందగాడు'లో అతడి లుక్స్ చూసిన తర్వాత ఈ సినిమాకు మంచి బిజినెస్ జరిగినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అలాగే, బడా సంస్థలు నిర్మిస్తుండడం కారణంగానే ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 300 థియేటర్లలో విడుదలవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది గ్రాండ్ రిలీజ్ అని చెప్పొచ్చు.

  షర్ట్ మొత్తం విప్పేసి ‘ఎవడు' హీరోయిన్ హాట్ షో: తల్లైన తర్వాత కూడా ఇంత ఘాటుగానా!

  ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా ఉందట

  ఫస్టాఫ్ ఇలా... సెకెండాఫ్ మరోలా ఉందట

  యూఎస్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ‘నూటొక్క జిల్లాల అందగాడు' సినిమా ఇప్పటికే ప్రదర్శితం అయింది. దీన్ని చూసిన ప్రేక్షకులు చెప్పిన వివరాలు ప్రకారం.. ఈ సినిమా మొదటి సగం ఫన్నీగా సాగుతుందట. ఇంటర్వెల్ ట్విస్ట్ బాగుంటుందని తెలుస్తోంది. సెకెండాఫ్ మాత్రం పూర్తి స్థాయిలో ఎమోషనల్‌గా ఉంటుందని, క్లైమాక్స్ కొంచెం కొత్తగా ట్రై చేశారని తెలిసింది.

  సినిమాలో ప్లస్‌లు, మైనస్‌లు ఇవేనంటూ

  సినిమాలో ప్లస్‌లు, మైనస్‌లు ఇవేనంటూ

  ‘నూటొక్క జిల్లాల అందగాడు' మూవీలో అవసరాల శ్రీనివాస్ నటన హైలైట్‌గా ఉంటుందట. అతడు తన బట్టతలను దాచుకోవడం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయట. ఇక, కథ, కార్తీక్ సంగీతం, సినిమాటోగ్రఫీ, కామెడీ కూడా బాగుందట. అయితే, స్క్రీన్‌ప్లే, భావోద్వేగ సన్నివేశాల్లో బలం లేకపోవడం, మరీ ముఖ్యంగా కథను చక్కగా ప్రజెంట్ చేయకపోవడం మైనస్ అనే టాక్ వినిపిస్తోంది.

  అనసూయకు నెలలు అంటూ అభి సంచలన వ్యాఖ్యలు: ప్రెగ్నెన్సీపై అందరి ముందే ఊహించని ఆన్సర్

  Best Telugu TV Serials In 2020 | కార్తీక దీపం హవా..!!
  ‘నూటొక్క జిల్లాల అందగాడు' ఎలా ఉంది?

  ‘నూటొక్క జిల్లాల అందగాడు' ఎలా ఉంది?

  ఇప్పటి వరకూ అందిన రిపోర్టుల ప్రకారం.. ‘నూటొక్క జిల్లాల అందగాడు' మూవీ అన్ని వర్గాలనూ ఆకట్టుకునే చిత్రమే అని అంటున్నారు. అయితే, సెకెండాఫ్‌లో వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం కృతకంగా ఉండడంతో ఫీల్ మిస్ అవుతుందట. అయితే, అవసరాల శ్రీనివాస్ ఫన్ అండ్ ఎమోషనల్ యాక్టింగ్ కోసం ఈ మూవీని చూడొచ్చని అంటున్నారు. మొత్తంగా ఈ సినిమా పర్వాలేదనిపించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని వీక్షకులు చెబుతున్నారు.

  English summary
  Tollywood Talented Hero Srinivas Avasarala Recently Did Nootokka Jillala Andagadu Movie Under Rachakonda Vidya Sagar. Check Here To Know Audience Review.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X