»   » జయమ్ము నిశ్చయమ్మురా... అంటున్న శ్రీనివాస్ రెడ్డి

జయమ్ము నిశ్చయమ్మురా... అంటున్న శ్రీనివాస్ రెడ్డి

Posted By:
Subscribe to Filmibeat Telugu

నూతన నిర్మాణ సంస్థ శివ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రూపొందుతున్న అహ్లాద భరితమైన హాస్య ప్రధాన ప్రేమ కథా చిత్రం ‘జయమ్ము నిశ్చయమ్మురా'. ఏ.వి.ఎస్.రాజు సమర్పణ. సంచలన దర్శకులు రాంగోపాల్ వర్మ శిష్యుడు శివ రాజ్ కనుమూరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో "గీతాంజలి" ఫేం శ్రీనివాస్ రెడ్డి హీరో కాగా హీరోయిన్ పూర్ణ. 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ త్వరలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా దర్శక నిర్మాత శివ రాజ్ కనుమూరి మాట్లాడుతూ... ‘మన తెలుగు రాష్ట్రాలు సమైక్యంగా ఉన్న కాల నేపధ్యంలో పూర్తి వినోద భరితంగా ‘జయమ్ము నిశ్చయమ్మురా' మలచడమైనది. కరీంనగర్ కుర్రాడికి కాకినాడలో ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. అక్కడ అతనికి జరిగే పరిచయాలు, ఎదురయ్యే పరిణామాల సమాహారంగా రూపొందుతూ సహజ హాస్యానికి పెద్ద పీట వేస్తూ ఓ నగర పాలక సంస్థ కార్యాలయ నేపధ్యంలో జరిగే అందమైన ప్రేమ కథా చిత్రం. త్వరలో జరగబోయే ఆఖరి షెడ్యూల్ తో సినిమా మొత్తం పూర్తికావస్తుంది. త్వరలో ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తున్నాం' అన్నారు.

Srinivas Reddy and Poorna Starring Jayammu Nischayammuraa

శ్రీవిష్ణు, కృష్ణుడు, రవివర్మ, కృష్ణ భగవాన్, ప్రవీణ్, పోసాని కృష్ణమురళి, జీవా, కృష్ణంరాజు, జోగినాయుడు, డబ్బింగ్ జానకి, మీనా,నారాయణ రావు, సూర్య, గుండు సుదర్శన్, ప్రభాస్ శ్రీను, రోలర్ రఘు, ఫిష్ వెంకట్ ,జబర్దస్త్ సన్నీ, సముద్రం వెంకటేష్, రాహుల్ రామకృష్ణ, సిరి, మాధవి, సరితాశర్మ, జ్యోతి తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్: రవిచంద్ర, కెమెరా: నాగేష్ బన్నెల్, ఎడిటింగ్: వెంకట్, ఎగ్సిక్యుటివ్ ప్రొడ్యూసర్: భాస్కర్, లైన్ ప్రొడ్యూసర్: జగన్నాధన్ మణి, నిర్మాతలు: శివరాజ్ కనుమూరి-సతీష్ కనుమూరి, రచన-దర్శకత్వం: శివ రాజ్ కనుమూరి!

English summary
Srinivas Reddy & Poorna Starring "Jayammu Nischayammuraa" Movie in progress.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu