ఎన్టీఆర్‌తో విభేదాలపై శ్రీనివాస్‌రెడ్డి క్లారిటీ.. రూమర్లకు ఫోటోతో చెక్

By Rajababu

Recommended Video

Ntr Is Avoiding Comedian Srinivas Reddy

యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌కు కమెడియన్ కమ్ హీరో శ్రీనివాస్‌రెడ్డికి ఏవో విభేదాలు ఉన్నాయనేది సినీవర్గాల్లో తరచుగా చర్చ జరుగుతూ ఉంటుంది. తెలుగు దేశం పార్టీకి ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్టీఆర్‌ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి అందరికీ తెలిసిందే. ఆ ప్రమాదం తర్వాత శ్రీనివాస్‌రెడ్డిని యంగ్ టైగర్‌ దూరంగా పెట్టారు. ఆ విషయాన్ని శ్రీనివాస్‌రెడ్డి స్వయంగా ఓ ఇంటర్వూలో చెప్పుకొన్నారు. అయితే కొద్దిరోజులుగా శ్రీనివాస్‌రెడ్డి, ఎన్టీఆర్ మధ్య విభేదాల గురించి మీడియాలో కథలు కథలుగా కథనాలు వెలువడుతున్నాయి. ఈ సందర్బంగా శ్రీనివాస్‌రెడ్డి (వైఎస్ఆర్) స్పందించారు. అసలు ఏమైందంటే..

 ఎన్టీఆర్‌కు దూరంగా యాక్టర్ వైఎస్ఆర్

ఎన్టీఆర్‌కు దూరంగా యాక్టర్ వైఎస్ఆర్

గత కొద్ది సంవత్సరాలుగా ఎన్టీఆర్‌ చిత్రాల్లో శ్రీనివాస్‌రెడ్డి కనిపించిన దాఖలాలు తక్కువే. తాజాగా వీరిద్దరూ త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందించే అరవింద సమేత.. వీర రాఘవ అనే చిత్రంలో ఎన్టీఆర్‌తో వైఎస్ఆర్ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌లో ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని వార్తలు వెలువడ్డాయి.

ఎడమొఖం.. పెడముఖంతో

ఎడమొఖం.. పెడముఖంతో

గతంలోని విభేదాల కారణంగా అరవింద సమేత చిత్ర షూటింగ్‌లో ఎన్టీఆర్, శ్రీనివాసరెడ్డి ఎడమొఖం, పెడమొఖంగా ఉంటున్నారని గాసిప్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. వారి మధ్య అభిప్రాయ బేధాలు త్రివిక్రమ్‌ను ఇబ్బందిలోకి నెట్టాయనే ప్రచారం కూడా జరిగింది.

మధురం.. మధురం ఈ సమయం

ఎన్టీఆర్‌తో విభేదాల గురించి కథనాలు వెలువడుతున్న నేపథ్యంలో వాటికి పుల్‌స్టాప్ పెట్టడానికి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకొన్నారు. ఎన్టీఆర్, త్రివిక్రమ్‌తో కలిసి దిగిన ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్టు చేశారు. మధురం మధురం ఈ సమయం అంటూ ఓ కామెంట్ కూడా పెట్టారు. దీంతో మా మధ్య అభిప్రాయ బేధాలు లేవని చెప్పడానికి ప్రయత్నించారు.

జంబలకిడి పంబ చిత్రంలో

జంబలకిడి పంబ చిత్రంలో

అరవింద సమేత చిత్రంతోపాటు యాక్టర్ శ్రీనివాసరెడ్డి జంబలకిడి పంబ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకొంటూ విడుదలకు ముస్తాబవుతున్నది. అవుట్ అండ్ అవుట్ కామెడీ చిత్రంగా జంబలకిడి పంబ రూపుదిద్దుకొన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X