twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేనుండటం వల్లే ఎన్టీఆర్ బతికారు అన్నాను... కానీ నన్ను అర్థం చేసుకోలేదు

    థోయేూతుతఫ ఒకప్పుడు ఎన్టీయార్‌ కి అత్యంత సన్నిహితులలో ఒకడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి తర్వాత తర్వాత దూరం అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందీ?

    |

    అద్భుతమైన కామెడీ టైమింగ్‌ ఉన్న ఆర్టిస్టుల్లో ఒకడు శ్రీనివాసరెడ్డి. చిన్న డైలాగ్‌ని కూడా పర్‌ఫెక్ట్‌గా పలికించి నవ్విస్తుంటాడు. తన టాలెంట్‌కి తగినన్ని ఫుల్‌ లెంగ్త్‌ క్యారెక్టర్లు తనకి దక్కలేదనే చెప్పాలి. 'జయమ్ము నిశ్చయమ్మురా'లో శ్రీనివాసరెడ్డి తనలోని మరో కోణాన్ని చూపించాడు. వివిధ ఎమోషన్లు పలికించడంలో, క్యారెక్టర్‌ని అండర్‌ ప్లే చేయడంలో తన విలక్షణత చాటుకున్నాడు. ఇప్పుడు చిన్న సినిమాని పెద్ద హిట్ చేసిన నిజమైన శ్రీనివాస రెడ్ది ఇప్పుడు ఈ సినిమాకి మరింత హైఒప్ తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు. ప్రమోషన్ లలో ఎప్పుడూ లేనంత స్పీడ్ గా ఉన్నాడు... .

    సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో జూనియర్‌ ఎన్టీయార్‌తో తనకు ఉన్న విభేదాల గురించి మాట్లాడాడు. ఒకప్పుడు ఎన్టీయార్‌ కి అత్యంత సన్నిహితులలో ఒకడిగా ఉన్న శ్రీనివాస్ రెడ్డి తర్వాత తర్వాత దూరం అయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందీ? జూనియర్ తనని ఎందుకు తనని దూరం పెట్టాడు అనే సంగతులను ఒక పత్రికకి ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టాడు శ్రీనివాస రెడ్డి అతని మాటల్లోనే....

    2009 ఎన్నికల ప్రచారంలో:

    2009 ఎన్నికల ప్రచారంలో:

    ‘ఎన్టీయార్‌ నాకు ఎప్పట్నుంచో మంచి ఫ్రెండ్‌. ఎన్టీయార్‌, రాజీవ్‌, నేనూ కలిసి క్రికెట్‌ ఆడుకునేవాళ్లం. 2009 ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్టీయార్‌ పర్యటిస్తున్నప్పుడు రాజీవ్‌ కనకాల, సమీర్‌, రఘుతోపాటూ అతని బ్యాచ్‌లో నేనూ ఉన్నాను. అయితే నేను ఖమ్మంలోనే జాయిన్‌ అయ్యాను.

    ఎన్టీయార్‌ కార్‌కు యాక్సిడెంట్‌:

    ఎన్టీయార్‌ కార్‌కు యాక్సిడెంట్‌:

    ఖమ్మంలో సభ ముగిసిన తర్వాత వ్యాన్‌ను విజయవాడకు పంపించి మేమంతా హైదరాబాద్‌కు కార్లలో బయల్దేరాం. ముందు కార్‌లో ఎన్టీయార్‌, మరికొంత మంది స్నేహితులు బయల్దేరారు. మేం వెనుక కార్లో ఉన్నాం. కొంతదూరం వెళ్లిన తర్వాత ఎన్టీయార్‌ కార్‌కు యాక్సిడెంట్‌ అయింది.

    బ్లడ్ వస్తోంది :

    బ్లడ్ వస్తోంది :

    రోడ్డు పక్కన దుమ్ముపట్టిన బట్టలతో పిచ్చతను ఒకాయన ఉన్నారు. కొంతమంది ఆయనతో మాట్లాడుతున్నారు. మేం కారు దగ్గరు వెళ్లి చూస్తే అందులో ఎన్టీఆర్ లేరు. పక్కకెళ్లి చూస్తే బాగా దుమ్ముపట్టిన బట్టలతో గుర్తుపట్టడానికి వీళ్లేకుండా ఉన్నాడు తారక్. అదేంటన్నా ఇలా ఉన్నావ్ అంటే.. బ్లడ్ వస్తోంది అంటూ తల భాగం చూపించారు.

    ఆసుపత్రి మొత్తం రౌండప్ చేసేశాం:

    ఆసుపత్రి మొత్తం రౌండప్ చేసేశాం:

    వెంటనే నా బ్యాగ్‌లో టవల్ ఉంటే తలకు చుట్టేసి మా కార్లో ఎక్కించాం. దగ్గర్లోనే సూర్యాపేటలో మా పెద్ద అక్క ఉంటారు. ఏ హాస్పిటల్ బాగుంటుందని వాళ్లకు ఫోన్ చేశాం. ఫలానా ఆసుపత్రి అని చెప్పగానే వెళ్లి ఆసుపత్రి మొత్తం రౌండప్ చేసేశాం. పేషెంట్స్ తప్ప, ఎవరూ లేకుండా చేశాం. తారక్‌ను చూడగానే డాక్టర్ చేతులు వణుకుతున్నాయి కుట్లు వేయడానికి. వాళ్ల బ్రదర్ ఒక డాక్టర్ ఉంటే ఆయనే ఫస్ట్ ఎయిడ్ చేసి అక్కడి నుంచి హైదరాబాద్ కిమ్స్‌కు తీసుకొచ్చారు.

    నేను ఉన్నాను కాబట్టే:

    నేను ఉన్నాను కాబట్టే:

    ఈ ప్రాసెస్‌లో పక్కనే ఉన్న ఓ వ్యక్తి సరదాగానో లేక సెటైరికల్ గానో ‘నువ్వు అడుగు పెట్టావు. యాక్సిడెంట్‌ అయింది అన్నాడు'. నాకు చాలా బాధనిపించి వెంటనే రిటార్ట్‌ ఇచ్చాను. ‘నేను ఉన్నాను కాబట్టే ప్రాణాలతో బయటపడ్డారు. లేకపోతే ఇంకేమయ్యేదో' అని అన్నాను. అయితే వాళ్లు వేరే విధంగా అర్థం చేసుకుని ఎన్టీయార్‌కు చెప్పిఉంటారు.

    సంవత్సరాలు గడిచిపోతున్నా:

    సంవత్సరాలు గడిచిపోతున్నా:

    అప్పట్నుంచి మా మధ్య గ్యాప్‌ వచ్చింది. ఇది జరిగి సంవత్సరాలు గడిచిపోతున్నా మా మధ్య గ్యాప్‌ అలాగే ఉండిపోయింది. అయితే ఏదో ఒకరోజు ఎన్టీయార్‌ను కలిసి మాట్లాడుతా. మా మధ్య ఉన్న దూరాన్ని తగ్గిస్తాననీ, తారక్ తో తాను కలిసి మాట్లాడే సందర్భం కోసమే ఎదురు చూస్తున్నట్టు చెప్పాడు. జూనియర్ తనని అర్థం చేసుకుంటాడనే ఆశాభవం తోనే ఉన్నాడు శ్రీనివాస రెడ్డి

    చాలా కాల‌మైంది:

    చాలా కాల‌మైంది:

    తెలుగు సినిమాల్లో ఇలాంటి క‌థ‌తో సినిమాలు వ‌చ్చి చాలా కాల‌మైంది. ఎక్కడా ద్వంద్వర్థాలకు తావు లేకుండా చక్కగా తెరపై క‌థ‌ను ఆవిష్కరించాడు దర్శకుడు. చూడ‌డానికి ఇది ఓ సాధార‌ణ ప్రేమ‌క‌థే. కానీ ఆ క‌థ చుట్టూ అల్లుకున్న స‌న్నివేశాలు, రాసుకున్న పాత్రలు, వారి ప్రవర్తనా అన్నీ ఆకట్టుకుంటున్నాయి.

     నటుడు శ్రీనివాస రెడ్డి:

    నటుడు శ్రీనివాస రెడ్డి:

    కేవలం కామెడీనే కాదు సరైన అవకాశం ఇస్తే తానూ పేరున్న నటులకు తీసిపోననీ నిరూపించాడు శ్రీనివాస రెడ్డి. ఇన్నాళ్ళూ ఉన్న కమెడియన్ అన్న ట్యాగ్ పోయి నటుడు శ్రీనివాస రెడ్డి అని నిరభ్యంతరంగా పిలవచ్చు అనిపించే లా ఉన్న శ్రీనివాస రెడ్డి నటనకు ప్రశంసలు లభిస్తున్నాయి.

    English summary
    Srinivas Reddy is currently busy with the promotions of the family entertainer and is continuously attending interviews. In one of his interviews the actor revealed that he was there when Jr NTR met with the accident during the election campaign of Telugu Desam Party in March, 2009.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X