For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమెడియన్ శ్రీనివాసరెడ్డి జీవితంలో మధుర క్షణాలు: ఎంతలా సంబరపడిపోతున్నాడో!..

    |

    హాస్య నటులు హీరోలుగా ప్రమోషన్ పొందడం తెలుగు సినిమాల్లో చాలా కాలంగా ఉన్నదే. అయితే అలా హీరోలుగా మారినవాళ్లు ఎక్కువ కాలం ఆ స్థానాన్ని కొనసాగించలేకపోయారు. తిరిగి హాస్య నటుడి పాత్రల్లోనే కనిపించినవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఒక్క సునీల్ మాత్రమే హిట్స్ లేకపోయినా సరే.. హీరోగా నిలదొక్కుకోవడానికే తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు.

    కమెడియన్ శ్రీనివాసరెడ్డి మాత్రం ఇందుకు భిన్నం. అడపాదడపా ప్రధాన పాత్రల్లో మెరుస్తూనే.. హాస్య నటుడిగానూ కొనసాగుతున్నారు. ఆవిధంగా కెరీర్ ను బ్యాలెన్స్ చేసుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారనే చెప్పాలి. సరే, ఇదంతా పక్కనపెడితే.. ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి తన జీవితంలో కొన్ని ప్రత్యేక క్షణాలను ఎంజాయ్ చేస్తున్నారు.

    ఏంటా స్పెషల్?:

    ఏంటా స్పెషల్?:

    ఇటీవలే శ్రీనివాస్‌రెడ్డి సతీమణి ఓ పాపకు జన్మనిచ్చారు. ఈ సందర్భంగా తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోను శ్రీనివాస్‌రెడ్డి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'న్యూ ఎంట్రీ.. బేబీ గర్ల్..' అని పేర్కొంటూ ఈ ఫోటో పోస్టు చేశారు.

     గుర్తుండిపోయే పాత్రలు:

    గుర్తుండిపోయే పాత్రలు:

    చాలా కాలం హీరోల ఫ్రెండ్స్ గ్యాంగ్స్ లో హాస్య నటుడిగా నటించారు శ్రీనివాస్ రెడ్డి. తనదైన టైమింగ్‌తో హాస్యాన్ని పంచడంలో ఆయన ధిట్ట. ఇడియట్‌లో రవితేజ స్నేహితుడిగా.. వెంకీలో సూరిబాబుగా.. అలాగే ఢీ, దుబాయ్ శీను, డార్లింగ్ లాంటి సినిమాల్లో శ్రీనివాసరెడ్డి చేసిన కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది.

     హీరోగా ప్రమోషన్ :

    హీరోగా ప్రమోషన్ :

    ఇక గీతాంజలి, జయమ్ము నిశ్చమ్మురా వంటి సినిమాల్లో హీరోగాను మెప్పించారు శ్రీనివాస్ రెడ్డి. ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలనే నమోదు చేశాయి. ఓవైపు హీరోగా చేస్తూనే.. మరోవైపు హాస్య నటుడి పాత్రలనూ ఆయన విస్మరించడం లేదు. భవిష్యత్తులో ఆయన హీరోగా మరిన్ని సినిమాలు వచ్చే అవకాశం ఉంది.

    దర్శకత్వంలోకి కూడా?:

    దర్శకత్వంలోకి కూడా?:

    హీరోగా, హాస్య నటుడిగా మెప్పించిన శ్రీనివాస్ రెడ్డి.. ఇక దర్శకత్వంలోకి కూడా అడుగుపెట్టాలన్న ఆలోచనలో ఉన్నట్లు ఆమధ్య ఊహాగానాలు వినిపించాయి. హీరో రవితేజకు కథ కూడా చెప్పాడన్న గుసగుసలు వినిపించాయి. రవితేజ 'రాజా ది గ్రేట్' సినిమాకి శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వ శాఖలో పనిచేశాడన్న ప్రచారం కూడా జరిగింది. అయితే అధికారికంగా మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టత రాలేదు.

    English summary
    Actor Srinivas Reddy, his wife are blessed with a baby girl recently. Srinivas Reddy shared the image of baby in social media.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X