అక్కినేని అఖిల్ ఒక్కడే అతని ప్రెండ్
హైదరాబాద్: ఇండస్ట్రీలో నాకు ఫ్రెండ్స్ పెద్దగా లేరు. అఖిల్ సన్నిహితంగా ఉంటాడు. ''బ్రదర్. నువ్వు చాలా బాగా చేశావ్'' అని తను అభినందించాడు అంటున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడైన ఆయన 'అల్లుడు శీను' సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. వి.వి. వినాయక్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మొన్న శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించాడు.
అలాగే... ''ఈ సినిమా విడుదలకు ముందే నాన్న కొందరు సన్నిహితులకు సినిమా చూపించారు. వాళ్లయితే ఇదేదో చిరంజీవి, రవితేజ సినిమా అన్నట్లుగా ఎంజాయ్ చేశారు. దీనికితోడు నా పేరూ బాగా కలిసొచ్చింది. శ్రీను అని ఇంటికొకరు ఉంటారు కదా. ఇదీ నన్ను ప్రేక్షకులకు దగ్గర చేసింది. నాన్న, వినాయక్ అంకుల్ కలసి నన్ను రాత్రికి రాత్రే స్టార్‌ను చేశారు. సరిగ్గా నటించకపోయుంటే.. విమర్శలు వచ్చేవి. నేను తొందరగా భావోద్వేగానికి గురవుతాను. అందుకే అలాంటివి రాకుండా నటన, డ్యాన్స్, ఫైట్స్ విషయంలో జాగ్రత్త పడ్డాను'' అన్నారు.

ఇక పదోతరగతి పూర్తయ్యాక.. నాన్న సూచనతో యాక్టింగ్ స్కూల్‌లోచేరాను. హైదరాబాద్, ముంబయి, లాస్‌ఏంజిలెస్, వియత్నాం.. ఇలా అనేక ప్రాంతాల్లో నటన, డ్యాన్స్, ఫైట్స్ నేర్చుకున్నాను. లాస్ ఏంజిలెస్‌లో ఉన్నప్పుడు నేను శిక్షణ తీసుకున్న లీసార్‌బర్గ్ ఇన్‌స్టిట్యూట్ తరఫున కొన్ని స్టేజ్‌ప్లేల్లో నటించాను. అక్కడ నా నటనకు మంచి స్పందన వచ్చేది అని చెప్పుకొచ్చారు.
'ఒక్క బ్రహ్మానందంతో చేసినవి తప్ప.. మిగిలిన సన్నివేశాలు ఒకటి రెండు టేక్‌లకే పూర్తయ్యాయి. ఆయనతో నటిస్తున్నప్పుడు యాక్షన్ అనగానే నవ్వొచ్చేసేది. తొలుత ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత కుదురుకున్నాను. తొలి సినిమా చేసేశాం.. విడుదలైంది. ఇక మరో సినిమా ప్రారంభించేద్దాం అనుకునే రకం కాదు. తర్వాత సినిమాలో ప్రేక్షకులకు కొత్తగా ఎలా కనిపించాలని ఆలోచిస్తున్నాను. మళ్లీ అమెరికా వెళ్లి రెండు నెలలపాటు కొత్త డ్యాన్స్‌లు, ఫైట్స్ నేర్చుకుందామనుకుంటున్నాను. ఈ లోగా కథ సిద్ధమైతే.. వెంటనే వచ్చి సినిమా ప్రారంభిచేస్తాను'' అని వివరించారు.


Click it and Unblock the Notifications











