ఫోటోలు: నితిన్ ఫ్యామిలీ చూశారా.. పండగ చేసుకుంటున్నారు, శ్రీనివాసకల్యాణం ఈ రేంజ్‌లో!
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాసకళ్యాణం. ఈ చిత్రంలో నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ తుది దశకు చేరుకుంది. క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా రాబోతున్న ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొనివుంది. దిల్ రాజు సతీష్ వేగేశ్న కాంబినేషన్ లో ఇప్పటికే శతమానం భవతి వంటి సూపర్ హిట్ మూవీ వచ్చిన సంగతి తెలిసిందే. వివాహ ప్రాముఖ్యతని తెలియజేసే అంశతో ఈ చిత్రం రానుంది. ఈ చిత్ర లొకేషన్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

15 ఏళ్ల తరువాత
దాదాపు 15 ఏళ్ల తరువాత నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం శ్రీనివాసకళ్యాణం. దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన దిల్ చిత్రం ఎంతటి విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

చివరి దశకు షూటింగ్
శ్రీనివాసకల్యాణం చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం అందమైన ఇంటి సెట్ లో పండగ నేపథ్యంలో సాంగ్ షూట్ చేస్తున్నారు. లొకేషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. శ్రీనివాస కళ్యాణం లొకేషన్ పిక్స్ చూస్తుంటే చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతున్నట్లు అర్థం అవుతోంది.

భారీ తారాగణం
ఈ చిత్రంలో నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తుండగా మరో మరో హీరోయిన్ నందిత శ్వేతా కీలకపాత్రలో నటిస్తోంది. సీనియర్ నటుడు నరేష్, ప్రకాష్ రాజ్, జయసుధ, గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్ నటిస్తున్నారు.

ఆగష్టు 9 న విడుదల
ఈ నెలాఖరుకు షూటింగ్ మొత్తం పూర్తి చేసి జులై నుంచి ప్రమోషన్స్ మొదలు పెట్టాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఆగష్టు 9 న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.


Click it and Unblock the Notifications











