శ్రీనివాస కల్యాణం స్పెషల్ షో టాక్.. సెలెబ్రిటీల రివ్యూ, అందరూ క్లైమాక్స్ గురించే!

Recommended Video

Srinivasa Kalyanam Movie Celebrity Talk | Celebrity Review

నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. తెలుగు సంప్రదాయ వివాహాల ప్రాముఖ్యతని తెలియజేసే అంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ప్రేక్షకులని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ చిత్రం ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సెలెబ్రిటీల కోసం దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం స్పెషల్ షో వేయించారు. ప్రముఖ దర్శకుల నుంచి ఈ చిత్రానికి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.

నేను లోకల్ దర్శకుడు

నేను లోకల్ దర్శకుడు

నేను లోకల్ దర్శకుడు త్రినాథ్ రావు నక్కిన స్పెషల్ షో అనంతరం శ్రీనివాస కళ్యాణం చిత్రంపై తన అభిప్రాయాన్ని తెలియజేశారు. ఈ చిత్రం చూశాక పదేళ్ల క్రితం జరిగిన తన వివాహం తనకు గుర్తుకు వచ్చిందని త్రినాథ్ రావు అన్నారు. శ్రీనివాస కళ్యాణం లో చూపించిన చాలా అంశాలు తన పెళ్ళిలో కూడా జరిగిఉంటే బావుండేది అని తెలిపాడు.

 క్లైమాక్స్ గురించే

క్లైమాక్స్ గురించే

ఈ చిత్రాన్ని చూసిన ప్రతి దర్శకుడు క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా వివరిస్తున్నారు. ప్రకాష్ రాజ్, నితిన్ మధ్య జరిగే సంభాషణ అద్భుతంగా ఉన్నట్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. క్లైమాక్స్ సన్నివేశంలో సంభాషణ సినిమాకే హైలైట్ గా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇంద్రగంటి మాటల్లో

ఇంద్రగంటి మాటల్లో

ప్రముఖ దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ శ్రీనివాస కళ్యాణం చూసిన అనంతరం నటుడు ప్రకాష్ రాజ్ ని ప్రశంసల్లో ముంచెత్తాడు. క్లైమాస్ లో ఆయన నటన అద్భుతం అని అన్నారు. సన్నివేశాన్ని ఎక్కువగా ఎమోషనల్ చేయకుండా సంస్కారవంతంగా దర్శకుడు రూపొందించినట్లు ఇంద్రగంటి పేర్కొన్నారు.

 మళ్ళీ పెళ్లి చేసుకోవాలని

మళ్ళీ పెళ్లి చేసుకోవాలని

శ్రీనివాస కళ్యాణం చిత్రం చూసిన తరువాత తన భార్యని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని అనిపించేంత ఫీల్ కలిగిందని యువ దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపాడు. పెళ్లి గురించి మనకు తెలియని ఎన్నో విషయాలని ఈ చిత్రంలో ప్రభావవంతంగా చూపించారని అనిల్ రావిపూడి తెలిపాడు.

 అన్ని తరాలవారు

అన్ని తరాలవారు

శ్రీనివాస కళ్యాణం చిత్రం అన్ని తరాల వారు చూడదగ్గ చిత్రం అని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలిపారు. పెళ్లైన వారు వారిని వారు ఈ చిత్రంతో గుర్తు చేసుకుంటారు. పెళ్లి కానీ వారు తమ పెళ్లి ఇలా జరగాలని కోరుకుంటారు. శ్రీనివాస కళ్యాణం చిత్రంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ గౌరవం మరో స్థాయికి చేరుతుందని వంశీ పైడిపల్లి తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X