‘శ్రీనివాస కళ్యాణం’ బ్యూటిఫుల్ మూమెంట్స్... అంచనాలు పెంచుతున్న వీడియో!

By Bojja Kumar

నితిన్‌, రాశీ ఖన్నా హీరో హీరోయిన్లుగా దిల్ రాజు బేనర్లో తెరకెక్కుతున్న చిత్రం 'శ్రీనివాస కళ్యాణం'. సతీష్‌ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్ట్‌ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. తాజాగా మేకింగ్ వీడియో విడుదల చేశారు. సినిమా చిత్రీకరణలోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఇందులో చూపించారు. ఫ్యామిలీ ప్రేక్షకులను థియేటర్ల వైపు ఆకర్షించేలా రూపొందించిన ఈ మేకింగ్ వీడియో సినిమాపై అంచనాలు మరింత పెంచింది.

 ఇంత అద్భుతమైన మూవీ రాలేదు అనే స్థాయిలో...

ఇంత అద్భుతమైన మూవీ రాలేదు అనే స్థాయిలో...

పెళ్లి గురించి ఇంత అద్భుతంగా చెప్పే సినిమా ఇప్పటి వరకు తెలుగులో రాలేదనే విధంగా ఈ సినిమాను తెరకెక్కించారట. ఇప్పటి వరకు పెళ్లిపై చాలా సినిమాలు వచ్చినా... ఇందులో చూపించిన కంటెంట్ ఏ సినిమాలోనూ చూపించలేదట. అందులోనూ దిల్ రాజు లాంటి నిర్మాత కూడా కమిట్ అయ్యాడంటే ఇందులో ఏదో ప్రత్యేకత ఉన్నట్లే అని చెప్పక తప్పదు.

తెలుగు ఇండస్ట్రీలోని మెయిన్ ఆర్టిస్టులందరూ..

తెలుగు ఇండస్ట్రీలోని మెయిన్ ఆర్టిస్టులందరూ..

ఈ చిత్రంలో తెలుగు సినిమా పరిశ్రమలోని దాదాపు మెయిన్ ఆర్టిస్టులందరూ నటించారు. ఇక పెళ్లి సీన్లో అయితే దాదాపు 60 మందికిపైగా సీనియర్ ఆర్టిస్టులు, వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులు భాగం అయ్యారు.

పెళ్లిపై చాలా వచ్చినా, ఇందులో ఇంకాస్త కొత్తగా

పెళ్లిపై చాలా వచ్చినా, ఇందులో ఇంకాస్త కొత్తగా

ఇప్పటికే పెళ్లి గురించి చాలా సినిమాలు వచ్చాయి. కొత్తగా ఏం చెప్పాలని అనుకున్నా... త్రేతాయుగంలో శ్రీరాముడు శివధనుసు విరిచి సీతను పరిణయమాడాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని గుడి నుంచి తీసుకువెళ్లి మరీ పరిణయమాడాడు. కలియుగంలో కుబేరుడి దగ్గర అప్పు చేసి మరీ వేంకటేశ్వర స్వామి పరిణయమాడాడు. యుగాలు మారినా.. దేవుడు మనిషిగా ఏ అవతారం ఎత్తినా.. పెళ్లి యొక్క గొప్పదనం చెబుతూనే ఉన్నాడు. అలా చెప్పాలనే చిన్ని ప్రయత్నమే మా ఈ శ్రీనివాస కళ్యాణం... అని దర్శకుడు తెలిపారు.

ప్రేక్షకులు తమను తాము

ప్రతి ఒక్కరి లైఫ్ లో జరిగే మూమెంట్స్ ఈ సినిమా. సినిమాలోని ఏదో ఒక పాత్రలో ప్రేక్షకులు తమను తాము చూసుకుంటారు. మేము చేస్తున్న ఈ ప్రయత్నం ప్రేక్షకులకు తప్పకుండా నచ్చతుందనే నమ్మకం ఉందని దిల్ రాజు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X