For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నితిన్ ‘శ్రీనివాస కళ్యాణం’ రిలీజ్ డేట్ ఖరారు

By Bojja Kumar
|

ఎన్నో విజ‌యవంతమైన చిత్రాల‌ను తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందించిన ప్రముఖ నిర్మాణ‌ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ ప‌తాకంపై... 14 ఏళ్ల క్రితం హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు, యువ హీరో నితిన్ కాంబినేషన్లో వచ్చిన 'దిల్' సినిమా ఎంత సెన్సేషనల్ హిట్ అయ్యిందో తెలిసిందే. అటువంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్లో ఈ సినిమా తెరకెక్కనున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ శ్రీనివాస క‌ళ్యాణం.

శ‌త‌మానం భ‌వ‌తి చిత్రాన్ని రూపొందించిన‌ డైరెక్ట‌ర్ స‌తీశ్ వేగేశ్న ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. నితిన్ స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా, నందిత శ్వేత హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు. విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాశ్ రాజ్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Srinivasa Kalyanam’s release date announced

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్ అఫీషియల్‌గా ప్రకటించారు. ఆగస్టు 9న శ్రీనివాస కళ్యాణం విడుదల చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

నితిన్‌, రాశీఖ‌న్నా, నందితా శ్వేత‌, ప్ర‌కాష్ రాజ్ త‌దిత‌రులు ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రామాంజ‌నేయులు, ఎడిటింగ్‌: మ‌ధు, సినిమాటోగ్ర‌ఫీ: స‌మీర్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ : బండి రత్న కుమార్, సంగీతం: మిక్కి జె.మేయ‌ర్‌, నిర్మాణం: శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: స‌తీశ్ వేగేశ్న‌.

English summary
Makers of Nithiin’s ongoing romantic family entertainer, Srinivasa Kalyanam, officially confirmed that the film will be released on August 9.
 
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more