వెంటపడిన హీరోయిన్... ఎవాయిడ్ చేసిన దిల్ రాజు, ఏం జరిగింది?
Recommended Video

తెలుగు సినిమా పరిశ్రమలో దిల్ రాజు అంటే ఒక బ్రాండ్. ఆయన బేనర్ నుండి సినిమా వస్తుందంటే అది తప్పకుండా మంచి సినిమా అనే నమ్మకం ఏర్పడేంతగా దిల్ రాజు బ్రాండ్ పాపులర్ అయింది. పక్క ఇండస్ట్రీ వారు కూడా తమ సినిమా తెలుగులో విడుదల చేయాలంటే దిల్ రాజు బేనర్ ద్వారా విడుదల చేయాలని కోరుకుంటారంటే... ఆ వ్యాల్యూ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు దిల్ రాజు మీద ఎలాంటి రీమార్క్ లేదు. ఏ విషయంలో అయినా పర్ఫెక్టుగా ఉంటారనే పేరుంది. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఆయన వ్యవహార శైలి ఎలా ఉంటుందో తాజా ఇంటర్వ్యూలో వెల్లడైంది.

హీరోయిన్లను కలవడానికి ఇష్టపడరు
హీరోయిన్లను కలవడానికి దిల్ రాజు అస్సలు ఇష్టపడరట. డైరెక్టర్‌కు ఓకే అయితే తర్వాత ఆమె ఫోటోస్, ఆడిషన్ వీడియోస్ చూసి ఫైనల్‌గా ఓ నిర్ణయానికి వస్తారట ఈ స్టార్ ప్రొడ్యూసర్. సినిమాకు సంబంధించిన పని ఉంటే తప్ప ఆయన అసలు వారిని కలవడానికి ఇష్టపడరట.

దిల్ రాజు వెంట పడిన హీరోయిన్
దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ బేనర్లో సినిమా చేస్తే తమ దశ తిరుగుతుందని...అప్ కమింగ్ హీరోయిన్లు భావిస్తుంటారు. ఆయన్ను స్వయంగా కలిసి అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలాగే హీరోయిన్ నందిత శ్వేతా కూడా తనకు అవకాశం ఇవ్వాలని కోరుతూ దిల్ రాజును కలవడానికి ప్రయత్నించిందట.

ఎవాయిడ్ చేస్తూ వచ్చిన దిల్ రాజు
ఈవిషయమై దిల్ రాజు గుర్తు చేసుకుంటూ... ‘నందితా శ్వేతా ఒక రోజు సడెన్‌గా మా ఆఫీస్‌కు వచ్చింది. కలవాలి అని చెప్పింది. సాధారణంగా నేను హీరోయిన్లు వచ్చి కలుస్తానంటే ఎవాయిడ్ చేస్తాను. కానీ ఆమె చాలా ప్రయత్నాలు చేసింది. రెండు మూడు సార్లు మెసేజ్ పెట్టింది. నేను హైదరాబాద్ లో ఉన్నాను సర్, కలవాలి అంటే ఆఫీసుకు రమ్మన్నాను.

నో చెప్పలేక సరే అని చెప్పాను
ఎక్కడికి పోతావు చిన్నవాడా తర్వాత తెలుగులో ఏ సినిమా చేయలేదు. చేయట్లేదు కూడా. నాకు మంచి కథ వస్తే చేయాలని ఉంది. మీ బేనర్లో ఏదైనా పాజిబిలిటీ ఉంటే చూడండి అని అడింది. ఆమె స్వయంగా వచ్చి అడిగినపుడు నో అని చెప్పలేం కాబట్టి సరే ఏదైనా ఉంటే చెబుతాను అని చెప్పాను... అని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు.

అలా ఈ సినిమాలో ఆమె సెలక్ట్ అయింది
శ్రీనివాస కళ్యాణం స్క్రిప్టు అయిపోయిన తర్వాత సతీష్ నేను కూర్చున్నపుడు ఇంకొక హీరోయిన్ గురించి టాపిక్ వచ్చింది. ఎక్కడికి పోతావు చిన్నవాడ హీరోయిన్ ఆఫీసుకు వచ్చి అడిగింది... అప్పటికి నేను ఇంకా ఆ సినిమా చూడలేదు.. ఏలా ఉంటుంది అని అడిగితే, బావుంటుంది సర్ పెర్ఫార్మెన్స్ బాగా చేసింది అని చెప్పాడు. తర్వాత ఫోటోస్ చూసి ఆ అమ్మాయికి టచ్ లోకి వెళ్లి కథ చెప్పండి అన్నాను. అలా ఆ అమ్మాయి ఆఫీసుకు వచ్చి అడగటం వల్ల గుర్తు పెట్టుకుని సతీష్ వెళ్లి కథ చెబితే శ్వేతా ఈ సినిమాలోకి వచ్చిందని... దిల్ రాజు తెలిపారు.

నందిత మాట్లాడుతూ...
తమిళంలో చాలా సినిమాలు చేశాను. తెలుగులో చేయాలనుకున్నపుడు స్టోరీ డిఫరెంటుగా ఉండాలి, గ్లామర్ డాల్ గా ఉండకూడదు, పెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర చేయాలనుకున్నపుడు నాకు ఎక్కడికి పోతావు చిన్నవాడా సినిమా వచ్చింది. ఆ తర్వాత సంవత్సరం పాటు మంచి మూవీ చేయాలని వెయిట్ చేస్తున్నపుడు... దిల్ రాజు బేనర్ గురించి తెలిసి ఆయనకు మెసేజ్ పెట్టాను. అది మైండ్ లో పెట్టుకుని నాకు ఈ చిత్రంలో పద్దు అనే క్యారెక్టర్ ఇచ్చారు. తొలిసారి ఇంత పెద్ద టీంతో పనిచేసి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఫ్యామిలీ వ్యాల్యూస్ ఉన్న సినిమాలు చాలా తక్కువ. చాలా రేర్ గా శ్రీనివాస కళ్యాణం అనే సినిమాలు వస్తాయి... అందరూ తప్పకుండా చూడాలి అని నంది శ్వేత తెలిపారు.


Click it and Unblock the Notifications











