శ్రావణ మాసంలో పెళ్లి చేసుకునే జంటలకు దిల్ రాజు బంపర్ ఆఫర్

By Bojja Kumar

నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. పెళ్లి విశిష్టతను తెలియజెప్పే కథాంశంతో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఒక ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. శ్రావణమాసంలో జరిగే పెళ్లి జంటలకు పట్టు వస్త్రాలు బహూకరించాలని ఇవ్వాలని నిర్ణయించింది.

ప్రీరిలీజ్ వేడుకలో ఈ విషయమై దిల్ రాజు మాట్లాడుతూ... ఆగస్టు 9 మాకు సెంటిమెంట్ డేట్. బొమ్మరిల్లు తర్వాత మళ్లీ 12 ఏళ్లకు ఈ డేట్ కుదిరింది. ఆ డేట్ ఫిక్స్ అవ్వగానే సతీష్ ఓ విషయం చెప్పారు. శ్రావణమాసంలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్లు జరుగుతాయి. ఆ జంటలకు పట్టువస్త్రాలు ఇస్తే బావుంటుందని ఆరు నెలల క్రితం అన్నారు. దాన్ని ఎలా చేయాలిని వర్కౌట్ చేసుకుంటూ వచ్చాం. వారం క్రితం నిర్ణయం తీసుకున్నాం.

Srinivasa Kalyanam team Pattu 	Dresses for new Bridal couples

కళామందిర్ కళ్యాణ్‌కు ఈ విషయం చెప్పగానే మేము మీ టీమ్‌తో కొలాబరేట్ అవుతానని ముందుకు వచ్చారు. శ్రావణ మాసంలో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి జరుగుతున్న జంటలకు మా శ్రీనివాస కళ్యాణం పట్టు వస్త్రాలు ఇవ్వబోతున్నాం. పెళ్లీరీ అందరూ వస్త్రాలు కొనుక్కుంటారు. కొనుక్కోలేరని కాదు... ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టెంపుల్ లో పూజలు చేయించి పంపించాలనేది మా ఆశ.

Srinivasa Kalyanam

తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి చేసుకునే జంటలు మీ వెడ్డింగ్ కార్డ్ మాకు ఫేస్ బుక్ ద్వారా పంపిస్తే మీ అందరికీ పట్టువస్త్రాలు పంపిస్తాం. కొందరికి మా టీమ్ స్వయంగా వచ్చి ఇస్తుంది. పెళ్లికి ఈ సినిమాలో ఎంతో విలువ ఇచ్చి చేస్తున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని దిల్ రాజు తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X