‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్ రాకింగ్... కొన్ని గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్!
నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. గురువారం సాయంత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేశారు.
ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 24 గంటల్లోపే 1 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. ఇక యూట్యూబ్‌లో ఈ ట్రైలర్ టాప్ పొజిషన్లో ట్రెండ్ అవుతోంది. దాదాపు 39వేల లైక్స్ వచ్చాయి.
ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ రూపొందించారు. ముఖ్యంగా పెళ్లి అనే పండగ గురించి ఇప్పటి వరకు ఏ సినిమాలోనూ చూపని విధంగా అద్భుతంగా ప్రజెంట్ చేయబోతున్నారని తెలుస్తోంది.
నిర్మాత దిల్ రాజు సైతం సినిమాపై పూర్తి నమ్మకంగా ఉందన్నారు. తమ బేనర్లో ఈ చిత్రం మరో గొప్ప చిత్రంగా నిలవడం ఖాయం అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు. నితిన్, రాశీ ఖన్నా మధ్య వచ్చే సీన్లు యూత్‌ను ఆకట్టుకునే విధంగా ఉండబోతున్నాయి.
పెళ్లంటే పెద్ద పండగ... సంక్రాంతి, దీపావళి లాంటి పండగలు ప్రతి సంవత్సరం వస్తాయి. కానీ పండగ జీవితంలో ఒక్కసారే వస్తుంది. అన్నింటికీ మించి ప్రతి ఇంటికి కొత్త తరం వస్తుంది, పెళ్లంటే మన అనుకున్న వారంతా వస్తారు, వాళ్లని చూస్తే మా డెబ్బైఏళ్ల జీవితం కనిపిస్తుంది... అంటూ ట్రైలర్లో జయసుధ చెప్పే డైలాగులు ఫ్యామిలీ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి.

ఈ అమ్మాయిలో ప్రాంబ్లం ఇదేరా... మనం వాళ్లని చూసినా, వాళ్లు మనల్ని చూసినా డిస్ట్రబ్ అయ్యేది మనమే, కావాల్సింది తీసుకోవాలంటే మీ అమ్మాయిల్ని పొగడాలిగా... అంటూ నితిన్ చెప్పే డైలాగులు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి.


Click it and Unblock the Notifications











