పెళ్లంటే పెద్ద పండగ: ‘శ్రీనివాస కళ్యాణం’ ట్రైలర్ రిలీజ్ చేసిన మహేష్ బాబు
నితిన్, రాశీ ఖన్నా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపొందిన సినిమా 'శ్రీనివాస కళ్యాణం'. దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్ నిర్మాతలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబందించిన ఆడియో విడుదలవ్వగా మంచి రెస్పాన్స్ వస్తోంది.
ఆగస్ట్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు. గురువారం సాయంత్రం హీరో మహేష్ బాబు చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ ఆకట్టుకునే విధంగా, అంచనాలు మరింత పెంచింది.

పెళ్లంటే పెద్ద పండగ... సంక్రాంతి, దీపావళి లాంటి పండగలు ప్రతి సంవత్సరం వస్తాయి. కానీ పండగ జీవితంలో ఒక్కసారే వస్తుంది. అన్నింటికీ మించి ప్రతి ఇంటికి కొత్త తరం వస్తుంది, పెళ్లంటే మన అనుకున్న వారంతా వస్తారు, వాళ్లని చూస్తే మా డెబ్బైఏళ్ల జీవితం కనిపిస్తుంది... అంటూ జయసుధ చెప్పే డైలాగులు ఫ్యామిలీ ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే విధంగా ఉన్నాయి.
ఈ అమ్మాయిలో ప్రాంబ్లం ఇదేరా... మనం వాళ్లని చూసినా, వాళ్లు మనల్ని చూసినా డిస్ట్రబ్ అయ్యేది మనమే, కావాల్సింది తీసుకోవాలంటే మీ అమ్మాయిల్ని పొగడాలిగా... అంటూ నితిన్ చెప్పే డైలాగులు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి.
ఇప్పటికే పెళ్లి గురించి చాలా సినిమాలు వచ్చాయి. కొత్తగా ఏం చెప్పాలని అనుకున్నా... త్రేతాయుగంలో శ్రీరాముడు శివధనుసు విరిచి సీతను పరిణయమాడాడు. ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవిని గుడి నుంచి తీసుకువెళ్లి మరీ పరిణయమాడాడు. కలియుగంలో కుబేరుడి దగ్గర అప్పు చేసి మరీ వేంకటేశ్వర స్వామి పరిణయమాడాడు. యుగాలు మారినా.. దేవుడు మనిషిగా ఏ అవతారం ఎత్తినా.. పెళ్లి యొక్క గొప్పదనం చెబుతూనే ఉన్నాడు. అలా చెప్పాలనే చిన్ని ప్రయత్నమే మా ఈ శ్రీనివాస కళ్యాణం... అని దర్శకుడు తెలిపారు.


Click it and Unblock the Notifications











