twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డిస్నీ లాండ్ లో ఫ్యామిలీతో కమిడియన్ శ్రీనివాస రెడ్డి (ఫొటో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : రీసెంట్ గా పటాస్ చిత్రంలో ఎస్ రెడ్డిగా కామెడీ పండించి అదరకొట్టిన శ్రీనివాస రెడ్డి..తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కు వెళ్లారు. ఆయన భార్య,కుమార్తెతో పాటు ఆయన ఓ వారం పాటు యుఎస్ కు ట్రిప్ కు వెళ్లారు. అక్కడ ఆయన డిస్నీలాండ్ కు వెళ్లి సేద తీరుతున్నారు. అలా డిస్నీలాండ్ లో ఎంజాయ్ చేస్తున్న శ్రీనివాస రెడ్డి ఫొటో ఇది. అక్కడ నుంచి రాగానే ఆయన పూర్తిగా తన పనిలో బిజీ అయిపోనున్నారు. పటాస్,గీతాంజలి విజయంతో ఆయనకు మళ్లీ పూర్తి బిజీగా మారుతున్నారు.

    శ్రీనివాస రెడ్డి ఎక్కువగా హాస్యప్రధాన పాత్రలు చేస్తూ ఎదిగారు. దర్శకుడు పూరీ జగన్నాధ్ తన చిత్రాలలో మంచి పాత్రలను ఇచ్చి ఇతడిని ప్రోత్సహించాడు. పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. విద్యాభ్యాసాన్నంతా అక్కడే పూర్తి చేశాడు. మిమిక్రీ కళతో బాగా పేరు తెచ్చుకున్నాడు. దీనితో టీ వీ రంగంలో చిన్న చిన్న వేశాలు వచ్చాయి. తర్వాత కొన్ని హాస్య ప్రధాన పాత్రలు పోషించాడు. ఇతడిలోని ప్రతిభను గుర్తించిన పూరీ జగన్నాధ్, తన హిట్ చిత్రం ఇడియట్ లో నాయకుడి స్నేహితుడు పాత్రను ఇచ్చాడు. ఇందులో బాగా నటించిన శ్రీనివాస రెడ్డి, మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుని విజయపధంలో దూసుకుపోయాడు.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

     Srinivasa Reddy Chilling At Disney Land

    'పటాస్‌' విషయానికి వస్తే.

    కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'పటాస్‌' చిత్రం 10 రోజుల క్రితం విడుదలై విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే . రచయితగా పలు చిత్రాలకి పనిచేసిన అనీల్ రావిపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపధ్యంలో చిత్రం శాటిలైట్ రైట్స్ ని పోటీపడి జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. 4.30 కోట్లకు ఈ రైట్స్ అమ్ముడు పోయినట్లు టీవీ వర్గాల్లో వినపడుతోంది. కళ్యాణ్ రామ్ సినిమాను టీవి కు కొందమా వద్దా అనే స్ధాయి నుంచి ఈ చిత్రం ఒక్కసారిగా...పోటీ పడి భారీ రేటుకు అమ్ముడయ్యే స్దితికి తెచ్చింది.

    కలెక్షన్స్ పరిశీలిస్తే. ప్రపంచ వ్యాప్తంగా పది రోజులకు 12 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం థియోటర్ రైట్స్ మొత్తం 9 కోట్లు కు అమ్ముడు పోవటంతో ఆల్రెడీ మూడు కోట్లు లాభంలో ఉన్నట్లు. ఈ రేంజిలో కలెక్షన్స్ రావటం కళ్యాణ్ రామ్ కెరిర్ లో రికార్డే. ఈ 10 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ (షేర్) : రూ 11.73 crore (కర్ణాటక& దేశంలో మిగిలిన ప్రాంతాలు కలిపి: Rs 70 లక్షలు; ఓవర్ సీస్: Rs 60 లక్షలు) సాధించింది.

    చిత్రం కథేమిటంటే....

     Srinivasa Reddy Chilling At Disney Land

    కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) ఓ కరప్టడ్ పోలీస్ ఆఫీసర్. కావాలని హైదరాబాద్ ట్రాన్సఫర్ చేయించుకుని వచ్చిన అతను అక్కడ తన అధికారం ఉపయోగించి... సిటీలో లంచాలు,దందాలు చేస్తూంటాడు. అంతేకాదు హైదరాబాద్ డిజిపి కృష్ణ ప్రసాద్(సాయి కుమార్)కు,పోలీస్ డిపార్టమెంట్ కు శతృవైన విలన్ జీకె(అశుతోష్ రానా)కు తొత్తులా మారతాడు. అయితే అసలు కళ్యాణ్ సిన్హా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు... అతని గతం ఏమిటి...గతంలోని అసలు నిజం తెలిసిన అతను మంచివాడిగా మారి... విలన్ కు ఎలా పటాస్ లా మారి ట్విస్ట్ లు ఇస్తాడు...ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి...సునామీ స్టార్ గా ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    అనీల్ రావి పూడి మాట్లాడుతూ... ''ఒక మాస్‌ కథతో దర్శకుడిగా పరిచయమైతే ఆ ప్రభావమే వేరుగా ఉంటుంది. ఆ విషయంలో వి.వి.వినాయక్‌గారే స్ఫూర్తి. దర్శకుల్లో వి.వి.వినాయక్‌ గారంటే ఇష్టం. ఆయన తీసిన తొలి సినిమా 'ఆది' స్ఫూర్తితోనే నేను 'పటాస్‌'లాంటి ఓ మాస్‌ కథని రాసుకొన్నా.అందుకే ఎన్ని ఇబ్బందులెదురైనా ఎంతో ఇష్టంగా రాసుకొన్న మొదటి కథతోనే సినిమా తీశా'' అన్నారు అనిల్‌ రావిపూడి.

    కథ గురించి చెప్తూ... ''ఒక అవినీతి పోలీసు అధికారి కథ ఇది. ఎప్పుడూ వసూళ్ల ధ్యాసలోనే గడిపే ఆ పోలీసు ఎలా మారాడన్నది తెరపైనే చూడాలి. పటాస్‌ అంటే టపాకాయ పేరు. అది చాలా గట్టిగా పేలుతుంది. ఇందులో హీరో పాత్ర తీరు కూడా అలాగే ఉంటుంది. ఈ కథలో వినోదమూ కీలకమే. కల్యాణ్‌రామ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది'' అన్నారు.

    తన ప్రస్దానం వివరిస్తూ... ''ఇంజినీరింగ్‌ అయ్యాక దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి అడుగుపెట్టాను. సహాయ దర్శకుడిగా, రచయితగా పలు చిత్రాలకు పనిచేశాను. 'శంఖం', 'శౌర్యం', 'దరువు', 'కందిరీగ', 'అలా మొదలైంది', 'మసాలా', 'ఆగడు' తదితర చిత్రాలు రచయితగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2012లో పక్కాగా మాస్‌ అంశాలతో కూడిన కథ రాసుకొని కల్యాణ్‌రామ్‌గారికి వినిపించాను. ఆయన అప్పుడు 'ఓం' చేస్తున్నారు. మొదట కథ విన్నాక 'చాలా బాగుంది. వేరే హీరోతో ఈ సినిమా నేను నిర్మిస్తా' అన్నారు. 'ఈ కథలో మీరు నటిస్తే బాగుంటుంది, నన్ను నమ్మండి' అని చెప్పా. దీంతో ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు'' అన్నారు.

    ఇక నందమూరి అభిమానులకి మళ్లీ సంక్రాంతి సందడి మొదలైనట్టుగా ఈ సినిమా వినోదాల్ని పంచుతుంది. ప్రస్తుతానికి 'పటాస్‌' విడుదలపైనే నా దృష్టంతా. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తా అని చెప్పుకొచ్చారు.

    కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. రొమాంటిక్‌ , యాక్షన్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్‌ మంచి సంగీతాన్ని అందించారు. భారీ హంగులతో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు. శ్రుతి సోధి పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. చిత్రంలో కల్యాణ్‌రామ్‌ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.

    సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

    English summary
    Along with his wife and daughter, Srinivas Reddy has left to USA to spend couple of weeks. He is seen enjoying the snow along with his family and later he went to Disney Land.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X