నితిన్ కళ్యాణంలో మరో ప్రత్యేకత.. వెంకీ కూడా జాయిన్ అయ్యాడు!
విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ చిత్రాలతో బిజీగా గడుపుతున్నాడు. అటు వరుణ్ తేజ్, ఇటు నాగ చైతన్యతో వెంకీ మల్టీస్టారర్ చిత్రాలు రూపొందుతున్నాయి. ఇదిలా ఉండగా వెంకటేష్ కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. నితిన్, రాశి ఖన్నా జంటగా నటిస్తున్న శ్రీనివాస కళ్యాణం చిత్రం ఆగష్టు 9 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.
ఈ చిత్రానికి వెంకటేష్ వాయిస్ ఓవర్ అందించబోతున్నాడు. వెంకటేష్ వాయిస్ తోనే శ్రీనివాస కళ్యాణం చిత్రం ప్రారంభం అవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. సంప్రదాయ వివాహ ప్రాముఖ్యతని తెలియజేసే చిత్రంగా శ్రీనివాస కళ్యాణం చిత్రాన్ని రూపొందించారు.

దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తరువాత నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం ఇది. శతమానం భవతి చిత్రంతో మ్యాజిక్ చేసిన సతీష్ వేగేశ్న ఈ చిత్రానికి దర్శకుడు. జయసుధ, ప్రకాష్ రాజ్, నరేష్, ఆమనితో పాటు 70 మంది ప్రధాన తారాగణంతో ఈ చిత్రం రూపొందింది.


Click it and Unblock the Notifications











