'రెడీ' దేనికంటే..
శ్రీను వైట్ల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న చిత్రం కి 'రెడీ' అనే టైటిలు పెట్టడానికి కారణం గమ్మత్తుగా చెప్తున్నారు.ఇందులో హీరో పాజిటివ్ థింకింగ్,పాజిటివ్ ఎవర్జీ ఉన్న కుర్రాడట.తను చేస్తున్నది కరక్టు అని నమ్మితే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడానికైనా రెడీ అయిపోతాడుట.అందుకే 'రెడీ' అనే టైటిలు పెట్టి 'దేనికైనా' అనే కాప్షన్ పెట్టారుట.ఈ విషయాన్ని దర్శక,నిర్మాతలు వంతులు వారీగా వివరిస్తున్నారు.వింటానికి బాగానే ఉంది కాని దాదాపు అన్నితెలుగు సినిమాల్లోనూ హీరో తన శక్తి సామర్ధ్యాలు గమనించకుండా దేనికైనా రెడీ అంటూండటం కామన్ కదా.ఇందులో వింతేముంది కొత్త విషయాన్ని చెప్పినట్లుగా బిల్డప్ లెందుకు అంటున్నారు ఫిల్మ్ నగర్ వాసులు.అయినా శ్రీను వైట్ల సినిమా అంటే ఫన్ కి కొదవుండదు.అంతకు మించి కావాల్సిందేముంది. గ్యారంటీ కామిడీతో రెడీ అవుతాడు. కాబట్టి రెండు గంటలు సేపు నవ్వుకోవటానికి రెడీ అవ్వచ్చు.


Click it and Unblock the Notifications











