‘దూకుడు’కి డబల్ డోస్ ‘ఆగడు’ : శ్రీను వైట్ల
దూకుడు చిత్రాన్ని నిర్మించిన అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని 14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నిర్మించనున్నారు. ఈ చిత్రం 'ఆగుడు' అనే టైటిల్ తో రూపొందబోతోంది. శ్రీను వైట్ల తన తాజా సినిమా 'బాద్ షా' విడుదల నేపథ్యంలో సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'బాద్ షా' తర్వాత మహేష్ బాబుతో 'ఆగడు' చిత్రం రూపొందించబోతున్నట్లు తెలిపారు. ఎంటర్ టైన్మెంట్ విషయంలో 'ఆగడు' చిత్రం దూకుడుకి డబల్ డోస్ లా ఉంటుందని శ్రీను వైట్ల వెల్లడించారు. మహేష్ బాబు ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత 'ఆగడు' సినిమా ప్లోర్ మీదకు రానుంది.
14 రీల్స్ ఎంటర్‌టైన్మెంట్స్ బేనర్లో 'దూకుడు' సినిమా చేసిన మహేష్ బాబు.....అదే బానర్లో సుకుమార్ దర్శకత్వంలో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ సినిమా వెంటనే మళ్లీ ఇదే బేనర్లో శ్రీను వైట్లతో 'ఆగడు'సినిమాకు అగ్రిమెంట్ కుదుర్చుకోవడం సర్వత్రా చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications












