మహేష్ బాబుని అడగలేదు, అడగను కూడా.. శ్రీనువైట్ల!

Recommended Video

AAA : Srinu Vaitla Exclusive Interview About Amar Akbar Anthony | Filmibeat Telugu

కమర్షియల్ చిత్రాలకు హాస్యాన్ని జోడించి విజయాలు అందుకోవడం శ్రీనువైట్ల ప్రత్యేకత. ఈ ఫార్ములా కొత్త కాలం మంచి ఫలితాలనే ఇచ్చినా క్రమంగా ఇది శ్రీనువైట్లకు బలహీనతలా మారింది. శ్రీనువైట్ల ఇటీవల వరుసగా పరాజయాలు చవిచూస్తున్నారు. కొంత గ్యాప్ తరువాత శ్రీనువైట్ల తెరక్కిస్తున్న చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. శ్రీనువైట్ల, రవితేజ క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న నాలుగవ చిత్రం ఇది. నవంబర్ 16న అమర్ అక్బర్ ఆంటోని ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. శ్రీనువైట్ల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సినిమా గురించి ఆసక్తికర విశేషాలు తెలియజేసారు.

రివేంజ్ ఉంటుంది కానీ

రివేంజ్ ఉంటుంది కానీ

అమర్ అక్బర్ ఆంటోని చిత్ర కథ గురించి జరుగుతున్న ప్రచారంపై శ్రీనువైట్ల స్పందించారు. ఈ చిత్రంలో రివేంజ్ ఉంటుంది కానీ అదే ప్రధాన కథ కాదని అన్నారు. హీరో, హీరోయిన్ మధ్య అద్భుతమైన కథ ఉందని శ్రీనువైట్ల తెలిపారు. ఈ జోనర్ ఓ ఇంతవరకు సినిమా రాలేదని కాన్ఫిడెంట్ గా చెప్పగలను అని శ్రీనువైట్ల అన్నారు.

విమర్శల గురించి

విమర్శల గురించి

ఒకే తరహాలో చిత్రాలు చేస్తున్నారనే విమర్శల గురించి శ్రీనువైట్ల స్పందించారు. నీకోసం చిత్రం చాలా విభిన్నమైనది. వెంకీ కామెడీతో కూడుకున్న థ్రిల్లర్ చిత్రం. ఇక ఢీ చిత్రానికి ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. రెడీ చిత్రంతో ఆ తరహా కథ చాలా బలంగా మారిపోయింది. నేనే కాదు అదే తరహాలో చాలా మంది సినిమాలు చేశారు. ఆడియన్స్ నుంచి వస్తున్న స్పందనతో ఎక్కువగా అలాంటి చిత్రాలు చేయవలసి వచ్చిందని శ్రీనువైట్ల తెలిపారు.

ప్లాపులు పడ్డ తరువాత

ప్లాపులు పడ్డ తరువాత

వరుస పరాజయాలు ఎదురైన తరువాత మహేష్ ని సినిమా చేయమని అడిగారా అనే ప్రశ్నకు శ్రీనువైట్ల సమాధానం ఇచ్చారు. తాను ఎప్పుడూ ఎవరిని సినిమా చేయమని అడగలేదని అన్నారు. మహేష్ నాకు చాలా మంచి ఫ్రెండ్. నాకు సినిమా ఇవ్వమని మహేష్ ని ఎప్పుడూ అడగలేదు.. ఇకపై అడగను కూడా. అమర్ అక్బర్ ఆంటోని చిత్రానికి కూడా నాతో సినిమా చేయడానికి ఐదుగురు నిర్మాతలు పోటీపడడ్డారని శ్రీనువైట్ల తెలిపారు.

గ్యాప్ రావడానికి కారణం

గ్యాప్ రావడానికి కారణం

రవితేజతో శ్రీనువైట్ల చాలా గ్యాప్ తరువాత సినిమా చేస్తున్నారు. నాకున్న కమిట్మెంట్స్ పూర్తి చేసుకుంటూ వస్తున్నాను అంతే. ప్రత్యేకంగా ఒక హీరోతో సినిమా చేయాలని అనుకోను. అందుకే ఇంత గ్యాప్ వచ్చిందని శ్రీనువైట్ల అభిప్రాయపడ్డారు. రవితేజ, నేను చాలా సరదాగా ఉంటాం. సినిమా చేయాలి అనుకుంటే అది జరిగిపోతుందని అన్నారు.

నాకు ట్రబుల్ షూటర్

నాకు ట్రబుల్ షూటర్

రవితేజ నాకు ట్రబుల్ షూటర్ లాంటివాడు. నీకోసం చిత్రం నిరాశపరిచినా వెంకీ చేశాడు. ఢీ చిత్రం మంచి విజయం సాధించింది. కానీ ఆ చిత్రంలో కొన్ని సమస్యలతో ఇబ్బంది పడుతున్న సమయంలో కూడా రవితేజ నాకు అవకాశం ఇచ్చాడు. రవితేజ సినిమా చేద్దాం అని చెప్పగానే కేవలం నెలలో దుబాయ్ శీను కథ రెడీ చేశానని శ్రీనువైట్ల తెలిపారు.

 విపరీతమైన హాస్యం

విపరీతమైన హాస్యం

అమర్ అక్బర్ ఆంటోని చిత్రం విభిన్న కథతో తెరకెక్కించాం. అయినా కూడా ఏ చిత్రంలో విపరీతంగా నవ్వించే హాస్యం ఉంటుందని శ్రీనువైట్ల తెలిపారు. ఆరేళ్ళ గ్యాప్ తరువాత ఇలియానా ఈ చిత్రంలో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. మంచి అంచనాలు నెలకొని ఉన్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X