Don't Miss!
- News అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ: బారులు తీరిన ఓటర్లు
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
మహేష్ బాబుతో బిగ్ ప్రాజెక్ట్ పై క్లారిటీ ఇచ్చిన శ్రీను వైట్ల.. మరో మూడు కథలు రెడీ..
సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని ప్రతి ఒక్క స్టార్ దర్శకుడు కోరుకుంటాడు. క్లాస్ దర్శకుల నుంచి మాస్ దర్శకుల వరకు కూడా అందరితోనూ మహేష్ సినిమా చేయాలని అనుకుంటాడు. ఫైనల్ గా ఒక మంచి కథ సెట్టయితేనే మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనేది అందరికి తెలిసిన విషయమే. ఇప్పటికే శేఖర్ కమ్ముల నుంచి రాజమౌళి వరకు అందరూ కూడా మహేష్ బాబుపై స్పెషల్ గా ఇంట్రెస్ట్ చూపిస్తున్న వారే. ఇక కామెడీ డైరెక్టర్ శ్రీను వైట్ల తో కూడా మహేష్ బాబు రెండు సినిమాలు చేశాడు. ఇక మళ్ళీ మరొక సినిమా రాబోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు ఆ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
ఫస్ట్ కాంబో బాక్సాఫీస్ హిట్
శ్రీను వైట్ల మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా దూకుడు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి పదేళ్లు కావస్తోంది. దూకుడు సినిమాతో మహేష్ బాబు మొదటి సారి బాక్సాఫీసు వద్ద 50 కోట్ల షేర్ ను సొంతం చేసుకున్నాడు. అంతకు ముందు వరకు కూడా వరుస పరాజయాలతో సతమతమవుతున్న సూపర్ స్టార్ దూకుడు సినిమాతో మళ్లీ భారీ స్థాయిలో ఫామ్ లోకి వచ్చేశాడు.
ఆ తరువాత డిజాస్టర్
ఇక ఆ సినిమా తర్వాత మరోసారి శ్రీను వైట్ల తో సినిమా చేయాలని అనుకున్న మహేష్ బాబు ఆగడు అనే సినిమా చేశాడు. కానీ రెండవ సారి వీరి కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత దర్శకుడు శ్రీనువైట్ల కూడా వరుస అపజయాలను ఎదుర్కొన్నాడు. ఎలాంటి సినిమా చేసినా కూడా మళ్లీ ఫామ్ లోకి రాలేదు.
మహేష్ కోసం మూడు కథలు
ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీనువైట్ల మరోసారి మహేష్ బాబుతో సినిమా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలియజేశాడు. ప్రస్తుతం తన దగ్గర మూడు ఫుల్ స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్నాయని అందులో ప్రత్యేకంగా ఒక కథను మహేష్ బాబు కోసం సిద్ధం చేస్తున్నట్లు వివరణ ఇచ్చారు. మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విధంగా కథను మరింత పవర్ఫుల్ గా రెడీ చేస్తానని కూడా తెలియజేశారు.
దూకుడు సీక్వెల్...
గతంలో దూకుడు సీక్వెల్ వచ్చే అవకాశం ఉందని కూడా కొన్ని కథనాలు వెలువడ్డాయి. అయితే అందులో ఎలాంటి నిజం లేదని మహేష్ తో ఒక బిగ్ స్కెల్ లో సినిమా చేయాలని అనుకుంటున్నట్లు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీను వైట్ల డి ఫ్రాంచైజ్ ను ఉపయోగించుకుంటూ డీ అండ్ డీ సినిమాలు చేయబోతున్నాడు.
ఈ సినిమాలో కూడా నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందని దర్శకుడు ఇదివరకే క్లారిటీ ఇచ్చాడు. ఇక దాదాపు స్క్రిప్టు మొత్తం పూర్తయ్యాయని త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వస్తుందని కూడా వివరణ ఇచ్చారు.
మరో వైపు మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఆ సినిమా అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్, రాజమౌళి వంటి దర్శకులతో సినిమాలు చేయబోతున్నాడు. మరి శ్రీను వైట్లతో సినిమా ఎప్పుడు చేస్తాడో చూడాలి.